News May 18, 2024
త్వరలో మేడిగడ్డ సందర్శన: రేవంత్ రెడ్డి
TG: కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి రాకపోవడంతో కీలక అంశాలు చర్చించలేకపోయినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘NDSA నివేదికపై కేబినెట్‌లో చర్చించాలి. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు మరమ్మతులు చేయాలా? ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? అనేది పరిశీలించాలి. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌లను సందర్శిస్తాం. ఇరిగేషన్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు.
Similar News
News December 10, 2024
పవన్‌ను చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను చంపుతానని ఆయన పేషీకి కాల్ చేసి బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విజయవాడకు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అటు, తనకు కూడా 2రోజుల కిందట ఇదే నంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని చెప్పిన హోంమంత్రి అనిత.. ఆగంతకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని DGPని ఆదేశించారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
News December 10, 2024
TODAY HEADLINES
* గత పాలకులు తెలంగాణ తల్లిని విస్మరించారు: రేవంత్
* ప్రభుత్వం పెట్టింది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి: KTR
* నాగబాబుకు మంత్రి పదవి.. నిర్ణయించిన CBN
* రాజ్యసభ సభ్యులుగా మస్తాన్‌రావు(TDP), సానా సతీశ్(TDP), ఆర్.కృష్ణయ్య(BJP) పేర్లు ఖరారు
* RBI కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా
* TG గ్రూప్-2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ
* పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న మోహన్‌బాబు, మనోజ్
News December 10, 2024
తెలుగు టైటాన్స్ ఘోర ఓటమి
ప్రోకబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ దారుణంగా ఓడిపోయింది. హరియాణా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచులో 46-25 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. TTలో ఆశిష్ నర్వాల్ సూపర్ 10 సాధించారు. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం హరియాణా స్టీలర్స్, పట్నా పైరెట్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.