News March 5, 2025

సీఎంను కలిసిన మీనాక్షి నటరాజన్

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో MLA కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అలాగే నామినేటెడ్ పదవులు, బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్, మంత్రులు భట్టి, ఉత్తమ్ కూడా పాల్గొన్నారు. అటు CM రేవంత్ ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు.

Similar News

News April 17, 2026

అంబానీని దాటేసి.. ఆసియా కుబేరుడిగా అదానీ

image

గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఆయన అగ్రస్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం అదానీ నెట్‌వర్త్ $92.6 బిలియన్లుగా ఉండగా, అంబానీ ఆస్తి $90.8 బిలియన్లుగా నమోదైంది. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ 19వ స్థానంలో, అంబానీ 20వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా మస్క్ ($656B) కొనసాగుతున్నారు.

News April 17, 2026

పండ్లు తింటున్నారా? FSSAI వార్నింగ్!

image

మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్లను కృత్రిమంగా పండించేందుకు ‘మసాలా’ (కాల్షియం కార్బైడ్) వాడకంపై FSSAI కఠిన చర్యలు చేపట్టింది. ఈ రసాయనం వల్ల చర్మ వ్యాధులు, గొంతు సమస్యలు, వాంతులు వచ్చే ప్రమాదం ఉండటంతో తనిఖీలు చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇథిలీన్ ద్రావణంలో పండ్లను ముంచడం కూడా నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

News April 17, 2026

అనుమతి లేకుండా అల్లు అర్జున్ పేరు, ఫొటో వాడొద్దు: ఢిల్లీ హైకోర్టు

image

అల్లు అర్జున్ వ్యక్తిత్వ హక్కులను (Personality Rights) పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు <<19671551>>ఉత్తర్వులు<<>> జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా పేరు, వాయిస్, ఫొటోలు, సంతకాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని స్పష్టం చేసింది. డీప్‌ఫేక్, AI టెక్నాలజీతో తన వాయిస్‌ని క్లోనింగ్ చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేయడం వంటివి తన బ్రాండ్ విలువను, ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆయన కోర్టును ఆశ్రయించగా ఇలా స్పందించింది.