News January 25, 2025
మీర్‌పేట ఘటన.. మరిన్ని విషయాలు

TG: మీర్‌పేటలో భార్యను <<15227723>>చంపి<<>> ఉడికించిన ఘటనకు ముందు భార్యభర్తలు సినిమాకు వెళ్లొచ్చారు. ఆపై ఊరెళ్లే విషయంలో గొడవపడి భార్యను గురుమూర్తి చంపేశాడు. వారి స్వగ్రామమైన ప్రకాశం(D) JPచెరువులో భర్తకు వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో గొడవ జరగ్గా, అప్పట్నుంచి ఊరెళ్లడం లేదు. భార్య చనిపోయాక పిల్లలను చూసుకునేందుకు తెలిసిన అమ్మాయైతే(ప్రేయసి) మంచిదనే సెంటిమెంట్‌తో ఆమెను పెళ్లి చేసుకోవాలని గురుమూర్తి ప్లాన్ వేశాడు.
Similar News
News February 11, 2025
డయాబెటిస్ ఉన్నా ఈ పండ్లు తినొచ్చు

తీపి పండ్లు తినాలని అనిపిస్తున్నా డయాబెటిస్ ఎక్కువవుతుందని మధుమేహులు భయపడుతుంటారు. రాస్ప్‌బెరీ, అవకాడో, ఆప్రికాట్, బ్లాక్‌బెరీ, పుచ్చకాయల్ని వారు తినొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇతర పండ్లతో పోలిస్తే వీటిలో చక్కెర శాతం తక్కువగా ఉంటుందని, మేలు చేకూర్చే కొవ్వులు ఎక్కువ ఉంటాయని వివరిస్తున్నారు. అయితే మధుమేహులు తమ షుగర్ స్థాయుల్ని బట్టి వైద్యుల సూచన మేరకు డైట్ అనుసరించాలని సూచిస్తున్నారు.
News February 11, 2025
అమరావతికి రూ.11వేల కోట్ల రుణం.. హడ్కో గ్రీన్ సిగ్నల్

AP: రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్ రుణం ఇస్తుండగా, హడ్కో ఇచ్చే అప్పు విషయంలోనూ ముందడుగు పడింది. రూ.11వేల కోట్ల రుణంపై ముంబైలో జరిగిన పాలకమండలి భేటీలో అధికారులు తుది నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత పత్రాలను సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబుకు అందించారు. నాలుగు నెలల్లో లోన్ అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలని సూచించారు.
News February 11, 2025
కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

TG: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇవాళ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం మాట్లాడుతూ స్టేషన్ ఘన్‌పూర్‌లోనూ ఉపఎన్నిక వస్తుందని కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య గెలుస్తారని జోస్యం చెప్పారు. ఉపఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.