News July 6, 2024
కాసేపట్లో సీఎంల భేటీ

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సా.6 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్‌లో భేటీ కానున్నారు. ఏపీ తరఫున చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్, బీసీ జనార్దన్ రెడ్డి, తెలంగాణ తరఫున రేవంత్, భట్టి విక్రమార్క పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు CSలు, ఉన్నతాధికారులు విభజన అంశాలపై చర్చించనున్నారు.
Similar News
News November 18, 2025
అన్నదాతా సుఖీభవ – అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

వాట్సాప్‌లో మనమిత్ర నంబర్ 9552300009కు ‘‘Hi’’ అని మెసేజ్ చేయాలి. తర్వాత సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి.. అన్నదాత సుఖీభవను సెలక్ట్ చేయాలి. స్థితిని తనిఖీ చేయండి వద్ద క్లిక్ చేసి.. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి మీద క్లిక్ చేస్తే.. రైతు పేరు, తండ్రి పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలు వస్తాయి. అందులోనే అన్నదాత సుఖీభవకు అర్హులా?, అనర్హులా? అనేది వస్తుంది. అనర్హులైతే అందుకు కారణం కూడా ఉంటుంది.

భారీ డీల్.. ఉక్రెయిన్‌కు 100 రఫేల్ జెట్లు!

ఫ్రాన్స్, ఉక్రెయిన్ మధ్య భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ నుంచి ఏకంగా 100 రఫేల్ F4 యుద్ధ విమానాలను, ఎయిర్ డిఫెన్స్ డిస్టమ్స్ను ఉక్రెయిన్ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు డీల్ పత్రాలపై రెండు దేశాల ప్రెసిడెంట్లు మేక్రాన్, జెలెన్స్కీ సంతకాలు చేశారు. 2035 నాటికి ఈ జెట్ల డెలివరీ పూర్తి కానుంది. డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసే రఫేల్ జెట్స్ ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కీలక పాత్ర పోషించాయి.