News July 6, 2024
కాసేపట్లో సీఎంల భేటీ
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సా.6 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్‌లో భేటీ కానున్నారు. ఏపీ తరఫున చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్, బీసీ జనార్దన్ రెడ్డి, తెలంగాణ తరఫున రేవంత్, భట్టి విక్రమార్క పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు CSలు, ఉన్నతాధికారులు విభజన అంశాలపై చర్చించనున్నారు.
Similar News
News December 12, 2024
గ్రేట్.. తొమ్మిది నెలల గర్భంతో భరతనాట్యం
భరతనాట్య కళాకారిణి, ఉపాధ్యాయురాలు యజ్ఞికా అయ్యంగార్ తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అన్ని అవరోధాలను అధిగమించి నృత్యం చేసి ఔరా అనిపించారు. గర్భవతి అయిన దేవకి, పుట్టబోయే కృష్ణుడి మధ్య మాతృ బంధాన్ని వెల్లడించే ‘మాతృత్వం’ అనే అంశంపై ఆమె ప్రదర్శన ఇచ్చారు. డాన్స్ చేసే సమయంలో తాను కడుపులోని పాప కూడా తన్నడాన్ని అనుభవించినట్లు చెప్పారు. దాదాపు గంటపాటు ప్రదర్శన ఇచ్చారు.
News December 12, 2024
ఆ దావాలను తీసుకోవద్దు: సుప్రీంకోర్టు
ప్రార్థనా స్థలాలపై దాఖలయ్యే దావాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు తీసుకోవద్దని, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల్లో తీర్పులు చెప్పొద్దని దేశంలోని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, 4 వారాల్లోగా వీటిపై సమాధానమివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ చట్టం హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల హక్కులను హరిస్తోందని పిటిషన్ దాఖలైంది.
News December 12, 2024
క్లీంకార ఇప్పుడెలా ఉందో చూడండి!
రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార చూస్తుండగానే పెరిగిపోయింది. తన తాతతో క్లీంకార ఆలయాన్ని సందర్శించిన ఫొటోను ఉపాసన షేర్ చేశారు. ‘ఈరోజు మా హాస్పిటల్ టెంపుల్‌లోని వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల్లో తన ముత్తాతలతో కలిసి క్లీంకార పాల్గొంది. తాత చేతుల్లో తనను చూస్తుంటే నా బాల్యం గుర్తొస్తోంది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, మెగా ప్రిన్సెస్ ఫేస్ కనిపించకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు.