News July 7, 2024
సీఎంల భేటీ మంచి ముందడుగు: వెంకయ్యనాయుడు

ఇద్దరు సీఎంల భేటీపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అన్ని అంశాల పరిష్కారమే లక్ష్యంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కావడం మంచి ముందడుగని అన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి పలు అంశాలపై వీలైనంత త్వరలో అంగీకారానికి వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News November 2, 2025
కార్తీకమాసంలో భక్తుల రద్దీ.. ప్రభుత్వం అలర్ట్

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనతో దేవాదాయశాఖ అప్రమత్తమైంది. కార్తీక మాసంలో సోమవారం, పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో రద్దీని నియంత్రించేందుకు భక్తులకు మైకుల ద్వారా నిరంతర సూచనలు ఇవ్వాలని జిల్లా ఎండోమెంట్ అధికారులను ఆదేశించింది. బారికేడ్లు పటిష్ఠంగా ఉంచాలని సూచించింది. ఒకే ప్రదేశంలో భారీ జనసమూహం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
News November 2, 2025
గిల్ ఫెయిల్.. జైస్వాల్కు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్లు

శుభ్మన్ గిల్ బ్యాటింగ్పై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. అతడు T20ల్లో వరుసగా విఫలం అవుతున్నా ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గిల్ గత 10 టీ20 ఇన్నింగ్సుల స్కోర్ 20, 10, 5, 47, 29, 4, 12, 37*, 5, 15 (ఈరోజు)గా ఉంది. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. దీంతో గిల్ను పక్కనబెట్టి యశస్వీ జైస్వాల్కు ఓపెనింగ్ ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మీ కామెంట్?
News November 2, 2025
ఇతిహాసాలు క్విజ్ – 54 సమాధానాలు

1. కర్ణుడిని బ్రహ్మాస్త్ర మంత్రం మరిచిపోయేలా శపించింది ‘పరుశరాముడు’.
2. అర్జునుడిని చంపిన తన కొడుకు పేరు ‘బభ్రువాహనుడు’.
3. త్రిపురాసురుని సంహారంలో శివుడి రథ సారథి ‘బ్రహ్మ’.
4. సతీదేవి దేహం భూమ్మీద పడిన స్థలాలను ‘శక్తిపీఠాలు’ అని అంటారు.
5. ఇంద్రుడు భీష్ముడికి ఇచ్చిన వరం ‘ఇచ్చామరణం’ (తనకు ఇష్టం వచ్చినప్పుడు మరణించే వరం).
<<-se>>#Ithihasaluquiz<<>>


