News July 7, 2024

సీఎంల భేటీ మంచి ముందడుగు: వెంకయ్యనాయుడు

image

ఇద్దరు సీఎంల భేటీపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అన్ని అంశాల పరిష్కారమే లక్ష్యంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కావడం మంచి ముందడుగని అన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి పలు అంశాలపై వీలైనంత త్వరలో అంగీకారానికి వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News December 10, 2024

మంత్రివర్గంలోకి నాగబాబు.. అంబటి సెటైర్

image

AP: నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటున్నారు.. పాపం’ అని Xలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, నాగబాబును ట్యాగ్ చేశారు.

News December 10, 2024

అతిగా నిద్రపోతున్నారా?

image

పెద్దవారికి రోజుకు 7-8 గంటల నిద్ర సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అతి నిద్ర గుండెకు చేటు చేస్తుందని, వెన్నునొప్పి వస్తుందని అంటున్నారు. దీంతో పాటు టైప్-2 మధుమేహానికి కారణమవుతుందట. ఎక్కువ సమయం నిద్రలో ఉంటే ‘సెరెటోనిన్’ స్థాయులు తగ్గి మైగ్రేన్ వంటి సమస్యలొస్తాయని హెచ్చరిస్తున్నారు. 9గంటలకు పైగా నిద్రపోయి లేస్తే బద్ధకం ఆవరించి ఆ రోజంతా అలసటగా ఉంటుందట. మీరు ఎన్ని గంటలు నిద్రపోతారో కామెంట్ చేయండి.

News December 10, 2024

రోహిత్ కెప్టెన్సీని అనుమానించొద్దు: కపిల్ దేవ్

image

అడిలైడ్ టెస్టులో IND ఓటమి తర్వాత రోహిత్ కెప్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తుతున్న వేళ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అతనికి అండగా నిలిచారు. ‘రోహిత్ కెప్టెన్సీని అనుమానించొద్దు. అతను కొత్తగా నిరూపించడానికి ఏం లేదు. తిరిగి దృఢంగా పుంజుకుంటారని భావిస్తున్నా. ఒకట్రెండు ప్రదర్శనలతో కెప్టెన్సీని అనుమానిస్తే, అతను 6నెలల కిందటే టీ20 వరల్డ్ కప్ సాధించాడు. మరి దానిపై మనం ఏం ప్రశ్నిస్తాం’ అని కపిల్ అన్నారు.