News October 29, 2024
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా ఇదే..?
‘విశ్వంభర’తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, నెక్స్ట్ ఓ సందేశాత్మక కథను తెరకెక్కించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ కోవకు చెందిన ఠాగూర్, శంకర్‌దాదా, స్టాలిన్ వంటి సినిమాల్ని చిరు గతంలో చేశారు. ఇప్పుడు అలాంటి మరో కథను రైటర్ బీవీఎస్ రవి సిద్ధం చేశారని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా ఈ మూవీని డైరెక్ట్ చేయొచ్చని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.
Similar News
News November 7, 2024
ఫార్ములా ఈ-కార్ రేసింగ్.. అసలేం జరిగింది?
TG: 2023లో నిర్వహించిన ఫార్ములా- ఈ కార్ రేస్‌కు ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు. దీంతో <<14548797>>KTR <<>>రిక్వెస్ట్‌తో 2024 FEBలో జరగాల్సిన 2వ దఫా రేస్ నిర్వహణకు HMDA ₹55 కోట్లు FEOకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఎన్నికల వేళ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు ₹55cr ఇవ్వడంపై కాంగ్రెస్ GOVT తప్పుబట్టింది. KTR మౌఖిక ఆదేశాలతోనే చెల్లించినట్లు పురపాలక శాఖ కమిషనర్ విచారణలో తెలిపారు.
News November 7, 2024
131 ఏళ్లలో ఒకే ఒక్కడు ట్రంప్
అమెరికా అధ్యక్ష పీఠంపై వరుసగా రెండుసార్లు కూర్చున్న నేతలు 15 మంది ఉన్నారు. వారిలో లింకన్, నిక్సన్, క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా ముఖ్యులు. అయితే తొలి దఫా(2016-20) తర్వాత వెంటనే కాకుండా నాలుగేళ్ల వ్యవధి అనంతరం పదవి చేపట్టిన రెండో నేతగా ట్రంప్ నిలిచారు. గత 131 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. చివరిసారిగా గ్రోవర్ క్లీవ్‌లాండ్(1885-89, 1893-97) ఇలా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
News November 7, 2024
‘పుష్ప-2’ BGM కోసం రంగంలోకి తమన్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ గురించి ఇంట్రెస్టింగ్ విషయం వైరలవుతోంది. ఈ చిత్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసేందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రంగంలోకి దిగినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయిందని తెలిపాయి. కాగా, దేవి శ్రీ ప్రసాద్ సినిమాలోని సాంగ్స్‌ను కంపోజ్ చేశారు. దీంతో ‘పుష్ప-2’ కోసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేస్తున్నారు.