News January 29, 2025
పురుషులు-మహిళలు సమానం కాదు.. కేరళ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత సలాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు, పురుషులు సమానం కాదని అన్నారు. స్త్రీలను, పురుషులను సమానంగా చూడటం వాస్తవికతకు వ్యతిరేకమని చెప్పారు. క్రీడల్లో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తారని ఉదహరించారు. అన్ని విషయాల్లోనూ స్త్రీ పురుషులు సమానమని చెప్పగలమా? అని ప్రశ్నించారు. సలాం వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News February 18, 2025
చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోంది: YCP

AP: వల్లభనేని వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోందని వైసీపీ ఆరోపించింది. గన్నవరం కేసులో అన్నీ కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలేనని.. కోర్టు లో సత్యవర్ధన్ స్టేట్‌మెంటే ఇందుకు నిదర్శనమని తెలిపింది. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని, ఎవరూ బలవంతం పెట్టలేదని ఆయన చెప్పారని పేర్కొంది.
News February 18, 2025
రేపటి నుంచే మెగా టోర్నీ.. గెలిచేదెవరో?

రేపటి నుంచి మార్చి 9 వరకు మెగా క్రికెట్ సమరం ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. మరి ఈ టోర్నీలో విన్నర్స్, రన్నర్స్, అత్యధిక పరుగులు, వికెట్లు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎవరు నిలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి. గత టోర్నీలో పాకిస్థాన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
News February 18, 2025
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. నిందితులకు ముగిసిన విచారణ

AP: తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో నలుగురు నిందితులకు కోర్టు విధించిన 5 రోజుల కస్టడీ ముగిసింది. సిట్ తాత్కాలిక కార్యాలయంలో వారి విచారణ జరగ్గా, ఇవాళ రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరుపతి 2వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. నిందితులు విచారణకు సహకరించట్లేదని, మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని సిట్ అధికారులు కోరినట్లు సమాచారం.