News November 8, 2024
మహిళల బట్టలు పురుషులు కుట్టకూడదు: మహిళా కమిషన్
మహిళల దుస్తులు పురుషులు కుట్టకూడదని, ఇది బ్యాడ్ టచ్ కిందకే వస్తుందని UP మహిళా కమిషన్ తెలిపింది. స్త్రీల దుస్తుల కొలతలు స్త్రీలు మాత్రమే తీసుకోవాలని, టైలరింగ్ షాపులో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మహిళల శిరోజాలనూ పురుషులు కత్తిరించకుండా, స్త్రీలే కత్తిరించేలా చర్యలు తీసుకోవాలని UP ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బ్యాడ్ టచ్ నుంచి మహిళలను రక్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
Similar News
News December 3, 2024
విపక్ష నేతగా ఏక్‌నాథ్ షిండే?
శివసేన పార్టీని ప్రతిపక్ష పార్టీగా ప్రకటించేందుకు బీజేపీ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిపై మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఆసక్తి చూపకపోవడంతో ఆయనను ప్రతిపక్షనేతగా నియమించనున్నట్లు సమాచారం. మహాయుతి ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శలను కొంతమేర తగ్గించేందుకే కమలనాథులు ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ మహారాష్ట్ర సీఎంను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
News December 3, 2024
వన్యప్రాణుల బోర్డు ఛైర్మన్‌గా సీఎం రేవంత్
TG: రాష్ట్రంలో వన్యప్రాణుల బోర్డుకు ప్రభుత్వం కొత్త సభ్యులను నియమించింది. ఈ బోర్డుకు సీఎం రేవంత్ ఛైర్మన్‌గా, అటవీశాఖ మంత్రి వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. అలాగే ఈ బోర్డులో మొత్తం 29 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, అధికారులు, పర్యావరణవేత్తలను బోర్డు నియమించింది. ఈ బోర్డులో ఎమ్మెల్యేలు భూక్యా మురళీ నాయక్, వంశీ కృష్ణ, పాయం వెంకటేశ్వర్లు, వెడ్మ బొజ్జు ఉన్నారు.
News December 3, 2024
నేడు క్యాబినెట్ భేటీ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్, రేషన్ స్మగ్లింగ్, పలు పెండింగ్ పనులపై చర్చిస్తారని సమాచారం. అలాగే వాలంటీర్ వ్యవస్థపై కూడా చర్చ జరిగే ఆస్కారం ఉందని తెలుస్తోంది.