News November 30, 2024
కేర్, ఆస్టర్ విలీనం.. మూడో అతిపెద్ద హాస్పిటల్ చెయిన్ ఆవిర్భావం

కేర్ హాస్పిటల్స్, ఆస్టర్ డీఎం విలీనంపై ఒప్పందం కుదిరింది. దీంతో 27 నగరాల్లో 38 ఆస్పత్రులు, 10,150 పడకలతో దేశీయంగా మూడో అతిపెద్ద హాస్పిటల్ చెయిన్ ఆవిర్భవించనుంది. 2027 నాటికి మరో 3,500 పడకలను పెంచుకునేందుకు సంస్థలు ప్రణాళిక సిద్ధం చేశాయి. విలీన కంపెనీలో ఆస్టర్, బ్లాక్స్టోన్, ఇతర ప్రమోటర్లతో కలిపి 57.3 శాతం, కేర్ షేర్ హోల్డర్లకు 42.7 శాతం వాటాలుంటాయి.
Similar News
News December 6, 2025
కొక్కెర వ్యాధి – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్ల షెడ్డును శుభ్రంగా ఉంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. సంతలో కొన్న పెట్టలను, పుంజులను టీకాలు వేయకుండా షెడ్డులో కోళ్లతో కలిపి ఉంచకూడదు. పెద్ద, చిన్న కోళ్లను వేరువేరుగా ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనలతో కోడిపిల్లలు పుట్టిన తొలి వారంలోనే F1(RD)/Lasota టీకా మందు కంటిలో/ముక్కులో వేస్తే 6 వారాల వరకు ఈ కొక్కెర వ్యాధి రాదు. కోళ్లకు ఆరు వారాల వయసులో R2B (R.D.) వ్యాక్సిన్ 0.5 ml s/c వేయాలి.
News December 6, 2025
వ్యూహ లక్ష్మి పసుపు ప్రసాదాన్ని ఎలా పొందాలి?

శ్రీవారి హృదయస్థానంలో వెలసిన వ్యూహ లక్ష్మి అమ్మవారిని పసుపు ముద్రతో అలంకరిస్తారు. ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం తర్వాత, తొలగించిన పాత పసుపును భక్తులకు పంపిణీ చేస్తారు. శ్రీవారి ప్రత్యేక సేవల్లో, అభిషేకంలో పాల్గొనే భక్తులకు ఈ పవిత్ర పసుపు లభిస్తుంది. ఈ ప్రసాదం పొందిన వారికి సిరిసంపదలకు లోటు ఉండదని విశ్వాసం. వ్యూహ లక్ష్మి అమ్మవారికి 3 భుజాల ఉండటం వల్ల త్రిభుజ అని కూడా పిలుస్తారు.
News December 6, 2025
రైళ్లలో వారికి లోయర్ బెర్తులు: కేంద్ర మంత్రి

రైళ్లలో వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్తులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. టికెట్ బుకింగ్ సమయంలో ఎంచుకోకున్నా, అందుబాటును బట్టి ఆటోమేటిక్గా కింది బెర్తులు వస్తాయని అన్నారు. స్లీపర్, 3AC బోగీల్లో కొన్ని బెర్తులను పెద్దలు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు కేటాయించినట్లు రాజ్యసభలో తెలియజేశారు. రైళ్లలో దివ్యాంగులు, సహాయకులకూ ఇలానే కొన్ని రిజర్వ్ చేసినట్లు చెప్పారు.


