News November 30, 2024
కేర్, ఆస్టర్ విలీనం.. మూడో అతిపెద్ద హాస్పిటల్ చెయిన్ ఆవిర్భావం
కేర్ హాస్పిటల్స్, ఆస్టర్ డీఎం విలీనంపై ఒప్పందం కుదిరింది. దీంతో 27 నగరాల్లో 38 ఆస్పత్రులు, 10,150 పడకలతో దేశీయంగా మూడో అతిపెద్ద హాస్పిటల్ చెయిన్ ఆవిర్భవించనుంది. 2027 నాటికి మరో 3,500 పడకలను పెంచుకునేందుకు సంస్థలు ప్రణాళిక సిద్ధం చేశాయి. విలీన కంపెనీలో ఆస్టర్, బ్లాక్‌స్టోన్, ఇతర ప్రమోటర్లతో కలిపి 57.3 శాతం, కేర్ షేర్ హోల్డర్లకు 42.7 శాతం వాటాలుంటాయి.
Similar News
News December 11, 2024
‘సరైన తిండి’ తినాలనుకోవడమూ ఓ రోగమేనట!
Orthorexia పేరెప్పుడైనా విన్నారా? గ్రీకులోorthos అంటే right. ఇక orexis అంటే appetite. సింపుల్‌గా కరెక్ట్ డైట్ అని పిలుచుకోవచ్చు. స్వచ్ఛమైన, నాణ్యమైన ఫుడ్ తినాలనే అందరికీ ఉంటుంది. కొందరిలో మాత్రం అతిగా ఉంటుంది. తెలియకుండానే ఒక పొసెసివ్‌నెస్ వచ్చేసింది. దీనినే Orthorexia అంటారు. ఆరోగ్యంగా ఉండాలనుకొంటూ తిండి తగ్గించేయడం, కొన్ని ఆహారాలను అస్యహించుకోవడం, కొన్నిటినే తింటూ బక్కచిక్కిపోవడం దీని లక్షణం.
News December 11, 2024
హిందువులు సహా మైనారిటీలపై 88 దాడులు: బంగ్లాదేశ్
హిందువులు సహా మైనారిటీలపై మత హింస కేసుల వివరాలను బంగ్లాదేశ్ వెల్లడించింది. ఆగస్టులో షేక్ హసీనా వెళ్లినప్పటి నుంచి 88 హింసాత్మక ఘటనలు జరిగాయంది. ఈ కేసుల్లో 70 మందిని అరెస్టు చేసినట్టు యూనస్ ప్రెస్ సెక్రటరీ ఆలమ్ తెలిపారు. సునమ్ గంజ్, గాజీపూర్, ఇతర ప్రాంతాల దాడుల్లో అరెస్టులు కొనసాగుతాయన్నారు. దాడులపై ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ ఆందోళన వ్యక్తంచేసిన మరుసటి రోజే వివరాలు వెల్లడించడం గమనార్హం.
News December 11, 2024
నేడు ఆ ల్యాండ్ మార్క్ దాటనున్న పుష్ప-2?
పుష్ప-2 విడుదలైన 5 రోజుల్లో(నిన్నటి వరకు) రూ.922 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. బాక్సాఫీస్ ట్రాకింగ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ ప్రకారం మూవీ నిన్న రూ.52.50 కోట్లు వసూలు చేసింది. ఆ ట్రెండ్ కొనసాగితే ఈరోజు ముగిసేసరికి ఆ మూవీ గ్రాస్ రూ.1000 కోట్లు దాటేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే విడుదలైన వారంలోనే ఆ ఘనత సాధించిన తొలి భారత సినిమాగా పుష్ప-2 రికార్డు సృష్టిస్తుంది.