News November 20, 2024
భారత్లో ఫుట్బాల్ మ్యాచ్కు మెస్సీ?

2025లో కేరళతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫుట్బాల్ టీమ్ 2 మ్యాచ్లు ఆడుతుందని ఆ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి అబ్దురహిమాన్ తెలిపారు. ఇందులో ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కూడా ఆడతారని చెప్పారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. కాగా కేరళలో ఫుట్బాల్కు క్రేజ్ ఎక్కువ. భారత్లో ఫుట్బాల్ ఎక్కువగా ఆడే కొన్ని రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. మెస్సీ చివరిగా 2011లో ఇండియాలో ఆడారు.
Similar News
News November 19, 2025
కాకినాడ మీదుగా శ్రీలంక వెళ్లాలనుకున్న హిడ్మా?

AP: వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో దండకారణ్యం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని మావోయిస్టు అగ్రనేత హిడ్మా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కొద్దిమంది అనుచరులతో కలిసి శ్రీలంకలో తలదాచుకోవాలని భావించాడని సమాచారం. కాకినాడ పోర్టు నుంచి సముద్రమార్గంలో వెళ్లేందుకు ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలో దండకారణ్యం నుంచి బయటికొచ్చిన హిడ్మా మారేడుమిల్లిలో ఎన్కౌంటర్లో చనిపోయాడని తెలుస్తోంది.
News November 19, 2025
అన్నదాత సుఖీభవ- నేడే అకౌంట్లలోకి రూ.7వేలు

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు చొప్పున జమ కానున్నాయి. PM కిసాన్ కింద ప్రధాని మోదీ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రూ.5వేలు.. మొత్తంగా రూ.7వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేలు చొప్పున జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.
News November 19, 2025
ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు

AP: వచ్చే ఏడాది ఇంటర్ 1st ఇయర్ పరీక్షల్లో బుక్లెట్ పేజీలను 24నుంచి 32కు పెంచారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్కు 32 పేజీలు ఉంటాయి. బయాలజీలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రానికి 24పేజీల చొప్పున 2 బుక్లెట్లు ఇస్తారు. భౌతిక, రసాయన, జీవశాస్త్ర పరీక్షలు 85 మార్కులకు పాస్ మార్క్స్ 29. కొన్ని సబ్జెక్టుల్లో 30% వచ్చినా, మొత్తం 35% ఉంటే పాస్గా పరిగణిస్తారు.


