News April 5, 2024
AI వీడియోలపై మెటా కీలక నిర్ణయం
డీప్‌ఫేక్ వీడియోలు పెరిగిన నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా మాతృసంస్థ మెటా తన పాలసీలలో కీలక మార్పులను ప్రకటించింది. త్వరలో US ఎన్నికలు జరగనుండటంతో AI జెనరేటెడ్ కంటెంట్‌పై నియంత్రణకు సిద్ధమైంది. ఇలాంటి వీడియోలను FB, ఇన్‌స్టాలో పోస్టు చేస్తే ‘Made with AI’ అనే లేబుల్ వచ్చేలా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. మే నుంచి ఇది అమల్లోకి రానుంది. మోసపూరిత కంటెంట్ నుంచి యూజర్లను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News January 16, 2025
ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చిన కేటీఆర్
TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో విచారణ అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చారు. ఆయనకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అటు సుమారు 7 గంటలపాటు కేటీఆర్‌ను అధికారులు విచారించారు. HMDA ఖాతా నుంచి విదేశీ సంస్థకు రూ.45 కోట్లు చెల్లించడంపై ప్రధానంగా ప్రశ్నలు సంధించారు.
News January 16, 2025
600 బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 600 ప్రొబెషనరీ ఆఫీసర్స్(PO) దరఖాస్తుల గడువు ఈనెల 19కి పొడిగించింది. అభ్యర్థులు ఇక్కడ <
News January 16, 2025
ఇన్ఫోసిస్: Q3లో రూ.6.806 కోట్ల లాభం.. 5,591 మంది నియామకం
డిసెంబర్ త్రైమాసికంలో రూ.6,806 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. 2023 DECతో(రూ.6,106 కోట్లు) పోలిస్తే 11.46 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. అదే సమయంలో కంపెనీ ఆదాయం 7.58 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరినట్లు పేర్కొంది. Q3లో కొత్తగా 5,591 మందిని రిక్రూట్ చేసుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.23 లక్షలకు చేరుకున్నట్లు వివరించింది.