News February 16, 2025
మేడ్చల్, శామీర్పేటకు మెట్రో

TG: హైదరాబాద్ మెట్రోను మరింత విస్తరించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం మేడ్చల్, శామీర్పేట్ ప్రాంతాల్లో మెట్రో కారిడార్ నిర్మాణ పనులకు సర్వే చేపట్టింది. ఈ నెలాఖరుకల్లా ట్రాఫిక్ సర్వే, భూసామర్థ్య పరీక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సర్వే తర్వాత ప్యారడైజ్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు కారిడార్ల నిర్మాణాలకు DPRలు రూపొందించనున్నారు.
Similar News
News October 18, 2025
కోడి పిల్లల పెంపకం – బ్రూడింగ్ కీలకం

కోడి పిల్లలు గుడ్డు నుంచి బయటకొచ్చాక కృత్రిమంగా వేడిని అందించడాన్ని “బ్రూడింగ్” అంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడింగ్ను 4-6 వారాల పాటు చేపట్టాల్సి ఉంటుంది. అయితే బ్రూడర్ కింద వేడిని కోడి పిల్లల వయసును బట్టి క్రమంగా తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. తక్కువైతే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడం, పెంచడం చేయాలి.
News October 18, 2025
ముంబై పోర్ట్ అథారిటీలో 116 పోస్టులు

ముంబై పోర్ట్ అథారిటీ 116 గ్రాడ్యుయేట్, COPA అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA) 105, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 11 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. వెబ్సైట్: https://mumbaiport.gov.in/
News October 18, 2025
‘కలౌ వేంకటో నాయకః’ అని ఎందుకు అంటారు?

‘కలౌ వేంకటో నాయకః’ అంటే కలియుగంలో వేంకటేశ్వరుడే నాయకుడు అని అర్థం. కలియుగపు పాపాలను శుద్ధి చేయడానికి, భవసాగరంలో మునిగిపోయే ప్రజలను రక్షించడానికి నారాయణుడు తిరుమలలో వెలిశాడు. పరమాత్మ అయిన ఆ వేంకటపతి తన దివ్య దర్శనం ద్వారానే ప్రజలకు శుభాన్ని, మోక్షాన్ని అందించడానికి విగ్రహ రూపంలో వరాహ క్షేత్రంలో స్థిరపడ్డాడు. ఆయన రాకతో ఈ క్షేత్రం పావనమైంది. ఈ విషయాన్ని వేంకటాచల మాహాత్మ్యం పేర్కొంది.<<-se>>#VINAROBHAGYAMU<<>>