News February 16, 2025

మేడ్చల్, శామీర్‌పేటకు మెట్రో

image

TG: హైదరాబాద్ మెట్రోను మరింత విస్తరించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం మేడ్చల్, శామీర్‌పేట్ ప్రాంతాల్లో మెట్రో కారిడార్ నిర్మాణ పనులకు సర్వే చేపట్టింది. ఈ నెలాఖరుకల్లా ట్రాఫిక్ సర్వే, భూసామర్థ్య పరీక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సర్వే తర్వాత ప్యారడైజ్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు కారిడార్ల నిర్మాణాలకు DPRలు రూపొందించనున్నారు.

Similar News

News April 17, 2026

తాత్కాలిక సీజ్‌ఫైర్‌లు మాకొద్దు: ఇరాన్

image

లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య 10రోజుల సీజ్‌ఫైర్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. లెబనాన్ నుంచి మొదలుకొని ఎర్రసముద్రం వరకు ఈ ఏరియాలో ఎలాంటి అశాంతి లేకుండా ఉండటమే తమకు కావాలని స్పష్టం చేసింది. తాత్కాలిక సీజ్‌ఫైర్‌లను ఒప్పుకోబోమని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న హింస ఇక్కడితో శాశ్వతంగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ వెల్లడించారు.

News April 17, 2026

రాహుల్ గాంధీకి షాక్

image

రాహుల్ గాంధీకి లక్నో హైకోర్టు షాకిచ్చింది. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఆయనపై FIR నమోదు చేయాలని ఆదేశించింది. కాగా రాహుల్‌కు బ్రిటీష్ పౌరసత్వం కూడా ఉందని కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ 2024లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉంటే దాన్ని ద్వంద్వ పౌరసత్వం అంటారు. భారత రాజ్యాంగం ప్రకారం ఇది నిషేధం.

News April 17, 2026

హీరోయిన్ పెళ్లి వార్తలు.. ఖండించిన తల్లి

image

మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్‌తో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లి వార్తలను ఆమె తల్లి లిస్సీ ఖండించారు. వారి మ్యారేజ్ కోసం ఎదురుచూస్తున్నామంటూ ఓ వ్యక్తి SMలో చేసిన కామెంట్‌కు ఆమె ‘ఫాల్స్ న్యూస్’ అని ఆన్సరిచ్చారు. 2022లో వచ్చిన హృదయం మూవీలో వీరిద్దరూ మ్యారీడ్ కపుల్‌గా నటించారు. ఆ సమయంలో ప్రేమ చిగురించిందని రూమర్లు వచ్చాయి. కాగా గతేడాది లోక: చాప్టర్-1తో కళ్యాణి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.