News August 29, 2024
విశాఖ, విజయవాడలో మెట్రోలు: మంత్రి నారాయణ
AP: విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు పూర్తి చేయాలని CM చంద్రబాబు ఆదేశించారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ మెట్రో ఫేజ్-1 కోసం రూ.11వేల కోట్లు, ఫేజ్-2 కోసం రూ.14వేల కోట్లు అవసరం అని చెప్పారు. విశాఖ మెట్రో ఫేజ్-1 కొమ్మాది జంక్షన్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు, ఫేజ్-2 కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఉంటాయని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.17,100 కోట్లు అవసరం అని వివరించారు.
Similar News
News January 31, 2025
MAHAKUMBH MELA: ఒకే రోజు 364 రైళ్లు
మహాకుంభమేళాకు భారీగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 10,028 రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా మరో 3,400 రైళ్లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మౌని అమావాస్య సందర్భంగా ఒక్క రోజే ప్రయాగ్‌రాజ్ నుంచి 364 రైళ్లను నడిపినట్లు ఆయన వివరించారు. నిన్న పవిత్ర స్నానం కోసం భక్తులు పోటెత్తగా అర్ధరాత్రి తర్వాత తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
News January 31, 2025
వీటిని బెడ్‌పై ఉంచి నిద్ర పోతున్నారా?
రాత్రి నిద్రపోయేముందు కొన్ని వస్తువులు బెడ్ దగ్గర పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. జెట్ కాయిల్స్, ఫోన్లు, ల్యాప్‌టాప్స్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు దూరంగా పెట్టాలి. బెడ్‌పై పెడితే అవి పేలే ప్రమాదం ఉంది. అలాగే బట్టలు, ఔషధాలు, ఆహార పదార్థాలు ఉండకూడదు. వీటి కోసం చీమలు, బొద్దింకలు వస్తాయి. టెడ్డీ బేర్‌ను పక్కన పెట్టుకుని నిద్రించకూడదు. దానిపై ఉండే దుమ్ము, బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని చేస్తాయి.
News January 30, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ ALL TIME RECORD
వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బుక్ మై షోలో అత్యధికంగా 3.33 మిలియన్ల టికెట్లు అమ్ముడైన తొలి తెలుగు ప్రాంతీయ చిత్రంగా నిలిచిందని నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ఈ నెల 14న రిలీజైన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు కలెక్షన్లలో రూ.300 కోట్లకు చేరువైంది.