News January 30, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ ALL TIME RECORD

image

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బుక్ మై షోలో అత్యధికంగా 3.33 మిలియన్ల టికెట్లు అమ్ముడైన తొలి తెలుగు ప్రాంతీయ చిత్రంగా నిలిచిందని నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ఈ నెల 14న రిలీజైన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు కలెక్షన్లలో రూ.300 కోట్లకు చేరువైంది.

Similar News

News February 17, 2025

నేటి నుంచి GOVT స్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు

image

TG: GOVT పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటి నుంచి కంటి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా 89,245మందికి పైగా చిన్నారులకు గత ఏడాది పరీక్షలు ముగిశాయి. వారిలో 88,676మందిలో దృష్టిలోపాలున్నాయని అధికారులు గుర్తించారు. ఇక ఈరోజు నుంచి వచ్చే నెల 5 వరకూ మూడో విడత పరీక్షలు ప్రారంభం జరగనున్నాయి. సమస్య ఎక్కువగా ఉన్న పిల్లలకు కళ్లజోళ్లను అందివ్వనున్నారు.

News February 17, 2025

26.77 కోట్ల ‘ఉపాధి’ పనిదినాలు కేటాయించండి: కేంద్రంతో ఏపీ

image

AP: ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025-26 ఏడాదికి APకి 26.77 కోట్ల పనిదినాల్ని కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ అధికారుల బృందంతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శైలేశ్ కుమార్‌ను ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో భారీగా పెరిగిన కూలీల సంఖ్యకు తగ్గట్టుగా కేటాయింపులు పెంచాలని కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలను ఆయనకు సమర్పించారు.

News February 17, 2025

టెక్ సదస్సులో ప్రసంగించనున్న కేటీఆర్‌

image

ఈ నెల 27, 28 తేదీల్లో బెంగళూరులో జరిగే ‘టెక్ అండ్ ఇన్నోవేషన్ సమిట్’లో పాల్గొనాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు ఆహ్వానం లభించింది. ఆ సదస్సులో ఆయన ప్రసంగించాలని నిర్వాహకులు ఆయన్ను కోరారు. ఆహ్వానాన్ని మన్నించిన కేటీఆర్, భవిష్య సాంకేతికాభివృద్ధి అనే అంశంపై కేటీఆర్ ప్రసంగిస్తారని తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ ప్రభుత్వాల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.

error: Content is protected !!