News April 3, 2025

MHBD: హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

MHBDలో జరిగిన <<15975323>>హత్య<<>> కేసును పోలీసులు చేధించారు. SP సుదీర్ రామ్నాథ్ వివరాలు.. పార్థసారథి అతడి భార్య స్వప్న మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో స్వప్న ఆమె ప్రియుడు విద్యాసాగర్‌తో కలిసి నలుగురు దుండగులకు రూ.5లక్షలు సుపారి ఇచ్చి మంగళవారం దంతలపల్లికి డ్యూటీకి వెళ్తున్న పార్థసారథిని హత్య చేయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్వప్న, విద్యాసాగర్‌ను అరెస్ట్ చేశారు. కాగా హత్య చేసిన నలుగురు పరారీలో ఉన్నారు.

Similar News

News April 10, 2025

మార్కుల గొడవలో కూతురిని చంపిన తల్లికి జీవితఖైదు

image

పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చాయని అబద్ధం చెప్పిన కూతురిని చంపిన కేసులో తల్లికి బెంగళూరు సిటీ కోర్టు జీవితఖైదు విధించింది. తనకు సెకండ్ పీయూ ఫైనల్ పరీక్షల్లో 95% మార్కులు వచ్చాయని సాహితి తన తల్లి పద్మినితో చెప్పింది. ఆ తర్వాతి రోజే ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని చెప్పింది. తల్లి సపోర్ట్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని కోప్పడింది. దీంతో గతేడాది ఏప్రిల్ 29న పద్మిని కోపంతో సాహితిని చంపింది.

News April 10, 2025

ఇండియాకు రాణా.. NIA స్టేట్‌మెంట్ రిలీజ్

image

ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రాణాపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. పలు కేంద్ర సంస్థల సహకారంతో రాణాను విజయవంతంగా ఇండియాకు రప్పించామని పేర్కొంది. ‘భారత్-అమెరికా ఒప్పందంతో తహవూర్ రాణాను తీసుకువచ్చాం. పలు ఉగ్ర సంస్థలతో కలిసి ముంబై ఉగ్రదాడికి రాణా కుట్ర చేశాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలతో అతడు చేతులు కలిపాడు. ముంబై మారణహోమంలో 166 మంది చనిపోయారు’ అని తెలిపింది.

News April 10, 2025

చంద్రబాబు గారూ.. రొయ్యల రేటు ఎందుకు పెరగడం లేదు?: జగన్

image

AP: సీఎం చంద్రబాబు నిర్వహించే సమావేశాలు ఆక్వా రైతులకు మేలు చేసేలా ఉండాలని YS జగన్ అన్నారు. ‘రొయ్యలకు వేసే మేతపై సుంకం 15% నుంచి 5%కి తగ్గింది. సోయాబీన్‌ రేటు కిలోకు రూ.105 నుంచి రూ.25కి పడిపోయింది. ముడిసరకుల రేట్లు పడిపోయినప్పుడు ఫీడ్‌ రేట్లు ఎందుకు తగ్గడం లేదు? US టారిఫ్స్ వాయిదా పడినా అక్కడికి ఎగుమతయ్యే రొయ్యల ధర ఎందుకు పెరగడం లేదు’ అని సీఎంను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

error: Content is protected !!