News June 26, 2024
జూన్‌లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ల జోరు!

బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఈనెల మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు భారీ వృద్ధిని నమోదు చేశాయి. మిడ్‌క్యాప్ ఇప్పటివరకు 7.4% వృద్ధిని నమోదు చేసింది. 2023 NOV తర్వాత ఈ స్థాయి వృద్ధి రావడం ఇదే తొలిసారి. మరోవైపు స్మాల్‌క్యాప్ సూచీలు 10.2% పెరిగాయి. చివరగా 2021 FEBలో ఈ స్థాయి వృద్ధి రికార్డ్ అయింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌పై ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News February 10, 2026
విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

AP: విశాఖ మెట్రోకు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. CM చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెట్రోకి అనుమతి ఇవ్వాలనే CM అభ్యర్థన మేరకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత మెట్రోకి సంబంధించిన ఉత్తర్వులు అధికారికంగా వెలువడే అవకాశముంది.
News February 10, 2026
AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్‌లోని AIIMS బీబీనగర్ 26 Jr. రెసిడెంట్, Sr. రెసిడెంట్ (నాన్ అకడమిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, PG, సంబంధిత విభాగంలో MD, DNB, DM, MS, MCh అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ రెసిడెంట్ పోస్టులను అకడమిక్ మెరిట్ ఆధారంగా, సీనియర్ రెసిడెంట్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in
News February 10, 2026
కృతజ్ఞత లేని వారికి మళ్లీ సాయం చేయొద్దు: పరుచూరి

ఇతరులు చేసిన మంచిని, సాయాన్ని ఇట్టే మర్చిపోయే రోజులివి. అలాంటి వారిని ఉద్దేశించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన ట్వీట్ అందర్నీ ఆలోచింపజేస్తోంది. మంచితనంతో చేసిన సాయాన్ని మర్చిపోయే వారికి మరోసారి మేలు చేయడం తప్పని అభిప్రాయపడ్డారు. ఇది అర్హత లేని వారికి దానం చేయడం కిందకే వస్తుందని రాసుకొచ్చారు. కృతజ్ఞత లేని వారికి పొరపాటున కూడా మళ్లీ సాయం చేసి తప్పు చేయవద్దని ఆయన సూచించారు.


