News February 1, 2025
మధ్యతరగతి ప్రజలు మోదీ గుండెల్లో ఉంటారు: అమిత్ షా

మధ్యతరగతి ప్రజలు ప్రధాని మోదీ గుండెల్లో ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విటర్లో పేర్కొన్నారు. రూ.12 లక్షల ఆదాయం వరకూ ఆదాయపు పన్ను కట్టనవసరం లేకపోవడం వారందరికీ ఊరటనిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ‘మధ్యతరగతి ప్రజల ఆర్థిక సంక్షేమం మరింత పదిలమయ్యేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. ఈ చర్యతో లబ్ధి పొందేవారందరికీ కంగ్రాట్యులేషన్స్’ అని తెలిపారు.
Similar News
News November 18, 2025
ఐ-బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి.. నిర్మాత డిమాండ్

ఐ-బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి.కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులు కాకపోయినా సినిమా వాళ్లైనా చేయాలంటూ ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించిన ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు. అలా జరిగితేనే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని తెలిపారు. తాను కడుపు మంటతో, బాధతో ఈ కామెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు. కాగా సి.కళ్యాణ్ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మీ COMMENT?
News November 18, 2025
ఖైదీని మార్చిన పుస్తకం!

మనిషి జీవితంపై పుస్తకాలు ఎంత ప్రభావం చూపుతాయో తెలిపే ఘటనే ఇది. అమెరికాకు చెందిన రెజినాల్డ్ డ్వైన్ బెట్స్ 17 ఏళ్ల వయసులో కార్ జాకింగ్ కేసులో జైలుపాలయ్యారు. ఏకాంత కారాగారంలో ఆయన ‘ది బ్లాక్ పోయెట్స్’ పుస్తకం చదివి స్ఫూర్తిపొందారు. 2020లో ఆయన ‘ఫ్రీడమ్ రీడ్స్’ అనే సంస్థను స్థాపించి అమెరికాలోని జైళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నారు. అలా 500 పుస్తకాలతో కూడిన 35 కొత్త లైబ్రరీలను ప్రారంభించారు.
News November 18, 2025
X(ట్విటర్) డౌన్‌కు కారణమిదే!

ప్రముఖ SM ప్లాట్‌ఫామ్ ‘X’ సేవలు <<18322641>>నిలిచిపోయిన<<>> విషయం తెలిసిందే. దీనిపై ట్విటర్ అధికారికంగా స్పందించలేదు. దాని హోస్ట్ సర్వర్ ‘క్లౌడ్‌ఫ్లేర్’లో గ్లిచ్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. X మాత్రమే కాకుండా క్లౌడ్‌ఫ్లేర్‌పై ఆధారపడిన కాన్వా, పర్ప్లెక్సిటీ వంటి సేవలు నిలిచిపోయాయి. ‘సమస్యను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం’ అని క్లౌడ్‌ఫ్లేర్ సంస్థ వెల్లడించింది.


