News August 30, 2024
మిలాద్ ఉన్ నబీ వేడుకలు వాయిదా

TG: గణేశ్ నవరాత్రి నేపథ్యంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు వాయిదా వేయాలన్న సీఎం రేవంత్ విజ్ఞప్తికి ఉత్సవ కమిటీ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. సెప్టెంబర్ 19న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది మహ్మద్ ప్రవక్త 1,500 జన్మదినం ఉండటంతో సంవత్సరం మొత్తం వేడుకలకు అనుమతి ఇవ్వాలని సీఎంను కమిటీ కోరింది. నిబంధనల ప్రకారం అనుమతిని పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
Similar News
News January 25, 2026
ఛీటింగ్ ఆరోపణలు.. రూ.10 కోట్ల దావా వేసిన పలాష్ ముచ్చల్

₹40 లక్షలు తీసుకుని మోసం చేశాడని, అమ్మాయితో మంచంపై <<18940645>>అడ్డంగా దొరికాడని<<>> తనపై వస్తున్న ఆరోపణలపై పలాష్ ముచ్చల్ కోర్టుకెక్కారు. ₹10 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు అబద్ధాలని స్పష్టం చేశారు. ‘నా పరువు, వ్యక్తిత్వాన్ని కించపరచాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా లాయర్ ద్వారా విజ్ఞాన్ మానేకు లీగల్ నోటీసు పంపాను’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
News January 25, 2026
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<
News January 25, 2026
ఫిల్మ్ ఇండస్ట్రీలో మత పక్షపాతం లేదు: అరుణ్ గోవిల్

ఫిల్మ్ ఇండస్ట్రీలో మత పక్షపాతం లేదని ‘రామాయణ’ సీరియల్ నటుడు అరుణ్ గోవిల్ అన్నారు. ఒకవేళ అది ఉండుంటే సల్మాన్, షారుఖ్, ఆమీర్ లాంటి ముస్లిం యాక్టర్లు స్టార్లు అయ్యేవారు కాదని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. తనకు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయని, దీనికి మతం కూడా కారణం కావొచ్చని మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇటీవల పేర్కొనడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణ్ గోవిల్ స్పందించారు.


