News August 30, 2024
మిలాద్ ఉన్ నబీ వేడుకలు వాయిదా
TG: గణేశ్ నవరాత్రి నేపథ్యంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు వాయిదా వేయాలన్న సీఎం రేవంత్ విజ్ఞప్తికి ఉత్సవ కమిటీ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. సెప్టెంబర్ 19న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది మహ్మద్ ప్రవక్త 1,500 జన్మదినం ఉండటంతో సంవత్సరం మొత్తం వేడుకలకు అనుమతి ఇవ్వాలని సీఎంను కమిటీ కోరింది. నిబంధనల ప్రకారం అనుమతిని పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
Similar News
News September 17, 2024
చంద్రబాబు అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలి: VSR
AP: సీఎం చంద్రబాబు నివసించే అక్రమ కట్టడాన్ని మొదట కూలగొట్టడం సముచితం అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ‘చంద్రబాబే పర్యావరణపరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రివలెట్‌పై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతనికి ఎక్కడుంటుంది? పాలకులకు ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే’ అని ట్వీట్ చేశారు.
News September 17, 2024
విమానాల్లో కన్నడ భాషలోనే మొదటి ప్రకటన చేయాలంటూ ప్రతిపాదన
బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్/టేకాఫ్ అయ్యే ప్రతి విమానంలో మొదటి ప్రకటనను కన్నడలోనే చేయాలని కన్నడ సాహిత్య పరిషత్ కోరింది. ఈ ప్రతిపాదనను సంస్థ ఛైర్మన్ డా.మహేశ్ జోషి సోమవారం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఎండీ హరి మరార్ ముందుంచారు. అయితే, దీనికి కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి తప్పనిసరని, ఆ మేరకు అనుమతి కోసం లేఖ రాస్తామని అధికారులు తెలిపారు.
News September 17, 2024
ప్రశాంతంగా కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనం: మంత్రి పొన్నం
TG: రాష్ట్రంలో నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. రేపు వర్కింగ్ డే కావడంతో ఆలస్యం కాకుండా త్వరగా నిమజ్జనం చేయాలని నిర్వాహకులను కోరారు. హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి గణేశులు తరలివస్తుండడంతో ట్యాంక్‌బండ్‌పై జనసందోహం నెలకొంది. నగరంలో ఇప్పటికే ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాల నిమజ్జనాలు పూర్తయ్యాయి.