News December 3, 2024
దక్షిణ కొరియాలో సైనిక పాలన.. కారణం ఇదే

దక్షిణ కొరియాలో ప్రతిపక్షాలు ఉత్తర కొరియా పట్ల సానుభూతి చూపుతున్నాయని ఆరోపిస్తూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో సైనిక పాలన విధించారు. దేశ అంతర్గత ప్రతికూల శక్తుల నుంచి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశ వ్యతిరేక శక్తులు ప్రజల స్వేచ్ఛ, ఆనందాన్ని దోచుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ శక్తులను నిర్మూలించడం అత్యవసరమని ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 14, 2026
NEET PG.. నెగటివ్ మార్కులు వచ్చినా అడ్మిషన్!

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న PG మెడికల్ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత పర్సంటైల్‌ను భారీగా తగ్గించడంతో రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు మైనస్ 40 మార్కులు సాధించినా అడ్మిషన్ పొందే అవకాశం దక్కింది. జనరల్, EWS అభ్యర్థులకు 7 పర్సంటైల్, PwBD 5 పర్సంటైల్, SC/ST/OBCలకు జీరో పర్సంటైల్‌గా కటాఫ్ నిర్ణయించారు. ఈ నిర్ణయం వైద్య విద్య ప్రమాణాలను దిగజార్చుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
News January 14, 2026
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

AP: వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామకంపై నాలుగేళ్లుగా నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చింది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం 12వ పీఠాధిపతిగా ఏపీ ధార్మిక పరిషత్ నిర్ణయించింది. పీఠం ఎవరు అధిష్ఠించాలనే విషయంలో వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య నాలుగేళ్లుగా వివాదం నడిచింది.
News January 14, 2026
పసిపిల్లలను ఎండలో ఎందుకు ఉంచాలంటే?

చిన్నారులకు ఇలా ఎండ తగిగేలా చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఉదయం వచ్చే సూర్య రశ్మిపడితే శరీరానికి విటమిన్ డి లభిస్తుందనే విషయం తెలిసిందే. ఇది చిన్నారుల శరీరంలో కాల్షియం సంగ్రహించడానికి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా నెలలు నిండకముందు జన్మించిన చిన్నారుల్లో సూర్య రశ్మి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల్లో వచ్చే కామెర్ల సమస్యను కూడా దూరం చేయవచ్చు.


