News November 10, 2024
పాల బకాయిలు రూ.50 కోట్లు విడుదల.. త్వరలోనే అకౌంట్లోకి
TG: విజయ డెయిరీకి పాలు విక్రయించే రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఓ నెల పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం రూ.50.65 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆదేశించింది. మరో నెల బకాయిలనూ త్వరలోనే చెల్లిస్తామని తెలిపింది. పాడి రైతుల నుంచి రోజూ 4.40లక్షల లీటర్లను విజయ డెయిరీ కొనుగోలు చేస్తోంది. నిధుల కొరత కారణంగా కొన్ని నెలలుగా చెల్లింపుల్లో ఇబ్బందులు వస్తున్నాయి.
Similar News
News December 8, 2024
Australia vs India: వికెట్లు కాపాడుకుంటేనే!
BGT రెండో టెస్టులో టీమ్‌ఇండియా కష్టాల్లో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 29రన్స్ వెనుకంజలో ఉంది. పంత్(28), నితీశ్ రెడ్డి(15) పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ మూడో రోజు వికెట్లు కాపాడుకుంటూ ఆస్ట్రేలియాకు 250+ రన్స్ టార్గెట్ నిర్దేశిస్తేనే గెలిచే అవకాశాలున్నాయి. రెండు ఇన్నింగ్స్‌లోనూ IND టాప్‌ఆర్డర్ విఫలమైన విషయం తెలిసిందే.
News December 8, 2024
‘పుష్ప’ తరహాలో బంగాళదుంపల స్మగ్లింగ్
పశ్చిమ బెంగాల్‌లో బంగాళదుంపల ధరలు పెరగడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయొద్దని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. కాగా వ్యాపారులు ‘పుష్ప’ మూవీ తరహాలో వాటిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్నారు. బెంగాల్, ఝార్ఖండ్ సరిహద్దులో రెండ్రోజుల్లో పోలీసులు 20కి పైగా లారీలను సీజ్ చేశారు. వాహనాల పైభాగంలో పశువుల మేత, కింద బంగాళదుంపల బస్తాలను అమర్చి కొందరు చేస్తున్న స్మగ్లింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
News December 8, 2024
కాకినాడ పోర్టును నాశనం చేయొద్దు: ద్వారంపూడి
AP: రేషన్ బియ్యంతో తమ కుటుంబానికి సంబంధం లేదని, సిట్ విచారణకైనా సిద్ధమని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 6 నెలల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేదని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును నాశనం చేయొద్దని కోరారు. ప్రభుత్వ చర్యలతో ఎగుమతిదారులు భయపడుతున్నట్లు చెప్పారు. కేసులు ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసన్నారు.