News January 19, 2025
వచ్చే నెల 12 నుంచి మినీ మేడారం

TG: మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే మరుసటి ఏడాది నిర్వహించే మండమెలిగె పండుగను మినీ మేడారంగా భక్తులు పిలుస్తారు. వచ్చే నెల 12 నుంచి 15 వరకు ఈ జాతర జరగనుంది. దీని కోసం రూ.32 కోట్లతో అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
Similar News
News January 11, 2026
మాపై దాడి చేస్తే.. ఇజ్రాయెల్ను టార్గెట్ చేస్తాం: ఇరాన్

దాడికి సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ పదేపదే <<18824047>>బెదిరిస్తుండటంపై<<>> ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ‘అమెరికా మాపై అటాక్స్ చేస్తే ఈ రీజియన్లో ప్రతి US బేస్ను, ఇజ్రాయెల్ను లక్ష్యాలుగా చేసుకుంటాం’ అని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ బాకెర్ కాలిబాఫ్ హెచ్చరించారు. తాము నలువైపుల నుంచి శత్రువులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ‘అమెరికా నాశనమవ్వాలి’ అంటూ పార్లమెంటులో సభ్యులు నినాదాలు చేశారు.
News January 11, 2026
సంక్రాంతికి స్టాలిన్ కానుక.. రూ.3వేలు, చీర, ధోతి, బియ్యం, చక్కెర

తమిళనాడు ప్రజలకు స్టాలిన్ ప్రభుత్వం రూ.6,936 కోట్లతో సంక్రాంతి కానుకలు అందిస్తోంది. రేషన్ కార్డు ఉన్న 2.22 కోట్ల కుటుంబాలకు రూ.3వేలతో పాటు కేజీ బియ్యం, కేజీ చక్కెర, చెరకు గడ, చీర, ధోతి ఉచితంగా పంపిణీ చేస్తోంది. రేషన్ దుకాణాల వద్ద రద్దీ లేకుండా ముందే ఇంటింటికీ టోకెన్లు అందించారు. దాంట్లో ఉన్న తేదీ ప్రకారం జనవరి 12 వరకు దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చు. కాగా ఏపీ, టీజీలో ఇలాంటి స్కీమ్ లేదు.
News January 11, 2026
న్యూజిలాండ్ జట్టులో భారతీయుడు.. ఎవరీ ఆదిత్య?

INDతో జరుగుతున్న తొలివన్డేలో న్యూజిలాండ్ జట్టులో మరో భారతీయుడు చోటుదక్కించుకున్నారు. లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ 2002 సెప్టెంబర్ 5న వేలూరు(TN)లో పుట్టారు. అతడికి 4 ఏళ్ల వయసప్పుడే ఫ్యామిలీ న్యూజిలాండ్కు వలస వెళ్లింది. 2023 ఆగస్టులో NZ తరఫున టీ20ల్లో, డిసెంబర్లో వన్డేల్లో అరంగేట్రం చేశారు. అప్పుడప్పుడూ భారత్కు వస్తుంటారు. CSK అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు. రజినీకాంత్కు ఆదిత్య పెద్ద ఫ్యాన్.


