News January 19, 2025
వచ్చే నెల 12 నుంచి మినీ మేడారం

TG: మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే మరుసటి ఏడాది నిర్వహించే మండమెలిగె పండుగను మినీ మేడారంగా భక్తులు పిలుస్తారు. వచ్చే నెల 12 నుంచి 15 వరకు ఈ జాతర జరగనుంది. దీని కోసం రూ.32 కోట్లతో అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
Similar News
News February 9, 2025
ఇందిరమ్మ ఇళ్లు.. వారి ఖాతాల్లోకి రూ.లక్ష?

TG: ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడతలో 4.5L మందిని ఎంపిక చేస్తారని, లబ్ధిదారుల జాబితాను ఇన్‌ఛార్జ్ మంత్రులు ఫైనల్ చేయగానే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలుస్తోంది. ఫస్ట్ ఫేజ్‌లో లబ్ధిదారులకు ₹లక్ష చొప్పున జమవుతాయని సమాచారం. దీనిపై సర్కార్ ప్రకటన చేయాల్సి ఉంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
News February 9, 2025
అత్యాశ.. ఉన్నదీ పోయింది!

కేంద్రంలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించాలన్న అత్యాశే ఆప్ కొంప ముంచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 3 సార్లు ఢిల్లీ ప్రజలు అధికారం ఇవ్వడం, ఆ తర్వాత పంజాబ్‌లోనూ పాగా వేయడంతో చక్రం తిప్పాలని కేజ్రీవాల్ భావించారు. ‘ఇండియా’ కూటమి నుంచి దూరమై నేరుగా మోదీపైనే విమర్శలు చేస్తూ దేశప్రజల దృష్టిని ఆకర్షించాలని చూశారు. ఈక్రమంలోనే అవినీతి ఆరోపణల కేసులు, ఢిల్లీలో పాలన గాడి తప్పడంతో ప్రజలు ఓటుతో ఊడ్చేశారు.
News February 9, 2025
వేడి వాతావరణం.. పెరగనున్న ఉష్ణోగ్రతలు

AP: వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొందని, నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా రికార్డయినట్లు తెలిపింది. నందిగామలో వరుసగా ఐదో రోజు అత్యధికంగా 37.6 డిగ్రీలు నమోదైంది.