News November 12, 2024

గోవాలో మినీ ‘సిలికాన్ వ్యాలీ’: పీయూష్

image

గోవాను సిలికాన్ వ్యాలీలా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ‘విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా కనిపించే గోవా చాలా ఆకర్షణీయమైన ప్రాంతం. ఇప్పటికే అక్కడ ఉన్న 23 పారిశ్రామిక ప్రాంతాలకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి’ అని గుర్తుచేశారు. సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్స్ పరిశ్రమలకు గోవాను కేంద్రంగా చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.

Similar News

News December 6, 2024

డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం ప్ర‌మాద‌క‌రం: కేజ్రీవాల్‌

image

బీజేపీ డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆప్ క‌న్వీన‌ర్ కేజ్రీవాల్ ఢిల్లీ ఓట‌ర్ల‌ను హెచ్చ‌రించారు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ఆప్ ప‌థ‌కాల‌ను నిలిపివేస్తార‌ని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న 20 రాష్ట్రాలో ఉచిత విద్యుత్ ఎక్క‌డ ఇస్తున్నార‌ని, మంచి స్కూల్స్‌, ఆస్ప‌త్రులు ఎక్క‌డున్నాయ‌ని ప్రశ్నించారు. గెల‌వ‌లేమ‌ని తెలిసే ఢిల్లీలో ఆప్ ఓటర్ల తొల‌గింపున‌కు బీజేపీ కుట్ర చేస్తోంద‌ని విమ‌ర్శించారు.

News December 6, 2024

PHOTO: గన్నుతో సీఎం రేవంత్

image

TG: ప్రజాపాలన-విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హోంశాఖ విజయాలపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన ఆయుధాల ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు. గన్నులు, రైఫిల్స్‌ పనితీరును ఆసక్తిగా పరిశీలించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోనే ఇది. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.

News December 6, 2024

ఆర్టీసీ పికప్ వ్యాన్‌ల సేవలు ప్రారంభం

image

TGSRTC దూర ప్రాంత ప్రయాణికుల కోసం పికప్ వ్యాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విడతలో ECIL-LB నగర్ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ సేవలను ప్రారంభించింది. విశాఖ, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కాకినాడ, కందుకూరు వెళ్లే వారి కోసం ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ సూచించింది.