News December 9, 2024
ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలకు అవకాశం: IMD

దేశ రాజధానిలో DEC 10- 14 వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని IMD తెలిపింది. అత్యల్పంగా 3°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని, ఢిల్లీతో పాటు యూపీ, పంజాబ్, హరియాణాలో చలి తీవ్రత పెరుగుతుందని చెప్పింది. పైప్రాంతాల్లోని పర్వతాల్లో మంచు పడటం, వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి చేరుకుంటాయంది. ఉత్తరభారతంలో ఇవాళ, రేపు దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Similar News
News July 11, 2025
ఒక్క సెకన్‌లో నెట్‌ఫ్లిక్స్ డేటా మొత్తం డౌన్‌లోడ్!

జపాన్ మరో సరికొత్త ఆవిష్కరణ చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను సృష్టించింది. సెకనుకు 1.02 పెటా బైట్స్ వేగంతో (పెటా బైట్= 10లక్షల GBలు) ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ వేగంతో ఒక్క సెకనులో నెట్‌ఫ్లిక్స్‌లోని డేటా మొత్తం లేదా 150 GB వీడియో గేమ్స్ డౌన్‌లోడ్ అవుతాయి. ఇది భారత సగటు ఇంటర్నెట్ వేగంతో (63.55 Mbps) పోలిస్తే 16 మిలియన్ రెట్లు వేగవంతమైంది.
News July 11, 2025
తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

* AP: ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న CM చంద్రబాబు
* రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు: హోంమంత్రి అనిత
* శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
* TG: మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ.. దరఖాస్తు తేదీ(ఈ నెల 20-27 వరకు) మార్పు
* కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ఏడుకు చేరిన మరణాలు
* కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు మరోసారి హరీశ్ రావు
News July 11, 2025
ఆస్పత్రిలో 2 గంటలున్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్!

ప్రస్తుతం 2 గంటలు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్నా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా క్లెయిమ్ చేస్తున్నాయి. దీనిపై పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ స్పందించారు. ‘గత పదేళ్లలో వైద్య రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. గతంలో కొన్ని ఆపరేషన్లకు చాలా సమయం పట్టేది. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే 24 గంటలు పెట్టేది. ఇప్పుడు నిబంధనలు మార్చడంతో 1-2 గంటలే పడుతుంది’ అని పేర్కొన్నారు.