News September 13, 2024
మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట
AP: మంత్రి కొల్లు రవీంద్ర పాస్‌పోర్టును పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 20న మంత్రి విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉండటంతో పాస్‌పోర్ట్ పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. కాగా ఆయనపై క్రిమినల్ కేసులు ఉండటంతో పాస్‌పోర్ట్ అధికారులు క్లియరెన్స్ నిరాకరించారు. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో పాస్‌పోర్ట్ తిరస్కరించొద్దని సుప్రీం, హైకోర్టులు తీర్పులిచ్చాయని రవీంద్ర లాయర్ వాదించారు.
Similar News
News October 10, 2024
కేటీఆర్ మాటలు మూసీ కంటే ఎక్కువ కంపు: ఎమ్మెల్యే మధుసూదన్
TG: హరియాణాలో కాంగ్రెస్ ఓడిపోయి BJP గెలిచినందుకు కేటీఆర్ సంబరాలు చేసుకుంటున్నారని MLA మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. అక్కడ ఈవీఎంల అవకతవకలు త్వరలో బయటపడతాయన్నారు. కేటీఆర్ మాటలు మూసీ కంటే ఎక్కువ కంపు కొడుతున్నాయని ఫైరయ్యారు. మూసీ ప్రక్షాళనపై డీపీఆర్ సిద్ధం కాకముందే రూ.లక్ష కోట్ల అవినీతి అంటున్నారని దుయ్యబట్టారు. తప్పుడు ప్రచారం చేస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 3 సీట్లు కూడా రావన్నారు.
News October 10, 2024
పాత రూల్స్‌తో మళ్లీ టీటీడీలో టెండర్లు: YCP
AP: టీటీడీలో మళ్లీ పాత నిబంధనలతోనే కూటమి సర్కార్ నెయ్యి కొనుగోలుకు నోటిఫికేషన్ ఇచ్చిందని వైసీపీ పేర్కొంది. ‘నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం విధించిన నిబంధనలు మార్చకుండా మళ్లీ అవే రూల్స్‌తో టెండర్లు పిలిచారు. అంటే వైసీపీ ప్రభుత్వం గట్టి నిబంధనలు అమలు చేసినట్లే కదా. కల్తీకి ఆస్కారం లేనట్లే కదా. సమాధానం చెప్పు చంద్రబాబు’ అని Xలో ప్రశ్నించింది.
News October 10, 2024
కొండా సురేఖకు కోర్టు నోటీసులు
TG: నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. కొండా సురేఖ అసత్య ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.