News November 9, 2024

మంత్రి కోమటిరెడ్డిని బర్తరఫ్ చేయాలి: హరీశ్ రావు

image

TG: మూసీ శుద్ధీకరణ వద్దంటే ప్రజలు KCRను ముక్కలు చేస్తారని మంత్రి కోమటిరెడ్డి చేసిన <<14562731>>వ్యాఖ్యలపై<<>> హరీశ్ రావు మండిపడ్డారు. ‘హింసను ప్రేరేపించేలా మంత్రి మాట్లాడితే సీఎం ముసిముసిగా నవ్వుతున్నారు. ఆయనపై పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదో డీజీపీ చెప్పాలి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను డిమాండ్ చేస్తున్నాం. సీఎం విధ్వంసకర మాటలకు సెన్సార్ బోర్డు మాదిరి A సర్టిఫికెట్ ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News November 3, 2025

చేవెళ్ల ప్రమాదం.. డ్రైవర్‌కు యాక్సిడెంట్ రికార్డు లేదు: TGSRTC

image

TG: చేవెళ్ల సమీపంలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గతంలో ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేనట్టు తేలిందని TGSRTC వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక విచారణ అనంతరం ప్రమాదానికి ఆర్టీసీ బస్సు, డ్రైవర్ కారణం కాదని తెలుస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది. రోడ్డు మలుపు వద్ద అతి వేగంతో ఉన్న టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పేర్కొంది.

News November 3, 2025

చెత్తవేసే వారి ఫొటోలు పంపిస్తే ₹250 నజరానా

image

నగర పరిశుభ్రతలో పౌరుల భాగస్వామ్యం కోసం గ్రేటర్ బెంగళూరు అథారిటీ, BSWML కొత్త స్కీమ్‌ చేపట్టాయి. రోడ్లపై చెత్తవేసే వారి ఫొటో, వీడియో తీసి పంపిస్తే ₹250 చెల్లిస్తామని ప్రకటించాయి. త్వరలోనే దీనికోసం డెడికేటెడ్ నంబర్, SM హ్యాండిల్స్‌, ప్రత్యేక యాప్‌ ఏర్పాటు చేయనున్నాయి. కాగా 5వేల ఆటోలతో ఇంటివద్దే చెత్త సేకరిస్తున్నా కొందరు ఇంకా రోడ్లపై వేస్తున్నారని, వారికి ₹2వేల ఫైన్ విధిస్తామని BSWML CEO తెలిపారు.

News November 3, 2025

నిద్రపోయే ముందు రీల్స్ చూస్తున్నారా?

image

చాలామంది రీల్స్ చూస్తూ నిద్రను పాడు చేసుకుంటున్నారని వైద్యులు గుర్తించారు. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్‌ను అణచివేస్తుందని తెలిపారు. ‘నిరంతర ఉద్దీపన వల్ల మెదడు విశ్రాంతి తీసుకోకుండా చురుకుగా ఉంటుంది. దీని ఫలితంగా నిద్ర నాణ్యత తగ్గి, మరుసటి రోజు బ్రెయిన్ ఫాగ్, చిరాకు పెరుగుతాయి. అందుకే నిద్రకు 30-60 నిమిషాల ముందు రీల్స్, టీవీ చూడకండి’ అని సూచించారు.