News April 11, 2024
బీఆర్ఎస్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్

TG: బీఆర్‌ఎస్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. ఎంపీ ఎన్నికల్లో BRS ఒక్క సీటు గెలిచినా తాను దేనికైనా సిద్ధమన్నారు. బీజేపీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు CMగా ఉంటారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలాంటి వారెవరూ లేరన్నారు. షిండేని సృష్టించింది BJP అన్నారు. హరీశ్, మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
Similar News
News July 6, 2025
నేటి ముఖ్యాంశాలు

* పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: రేవంత్
* ఈనెల 12 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి
* ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
* చర్చకు ప్రిపేరయ్యేందుకు 72 గంటల సమయం: కేటీఆర్
* మహిళలకు 5వేల ఈవీ ఆటోలు: మంత్రి పొన్నం
* AP: వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
* 20,494 ఎకరాల భూ సమీకరణకు CRDA ఆమోదం: మంత్రి
News July 6, 2025
టెస్టు చరిత్రలో తొలిసారి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.
News July 6, 2025
పట్టు బిగించిన భారత్.. మరో 7 వికెట్లు తీస్తే..

ENGతో రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. 608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రాలే(0), డకెట్(25), రూట్(6) ఔటయ్యారు. ఆకాశ్‌దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ గెలవాలంటే రేపు ఒక్కరోజే 536 రన్స్ చేయాలి. మరో 7 వికెట్లు తీస్తే టీమ్ ఇండియా గెలుస్తుంది. కాగా రెండో ఇన్నింగ్సులో భారత కెప్టెన్ గిల్ (161) సెంచరీతో మెరిశారు.