News March 16, 2024
బీఆర్ఎస్కు మంత్రి కోమటిరెడ్డి పంచ్

TG: ఢిల్లీ లిక్కర్ కేసుకు, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. ‘గతంలో ఏపీలో చంద్రబాబును అరెస్టు చేస్తే HYDలో నిరసనలు ఎందుకన్నారు. మరి ఇప్పుడు కవితను ED అరెస్టు చేస్తే రాష్ట్రంలో ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు? వెళ్లి ఢిల్లీలోని ED కార్యాలయం ముందు చేసుకోండి. అమాయక కార్యకర్తలను రోడ్లపైకి తెస్తున్నారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
Similar News
News August 5, 2025
హై లెవల్ మీటింగ్స్.. రేపు ఏం జరగబోతోంది?

రాష్ట్రపతి ముర్ముతో PM మోదీ, హోంమంత్రి అమిత్షా నిన్న వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం జమ్మూ కశ్మీర్ BJP నేతలతోనూ అమిత్షా సమావేశమయ్యారు. దీంతో రేపు J&Kకు మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తూ నిర్ణయం వెలువడొచ్చని ప్రచారం సాగుతోంది. ‘రేపు ఏం జరగదు. కానీ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సానుకూల నిర్ణయం రావొచ్చు’ అని J&K CM ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలేం జరగబోతోందంటూ SMలో తీవ్ర చర్చ నడుస్తోంది.
News August 5, 2025
వారితోనే షూటింగ్ చేసుకుంటాం: ఫిల్మ్ ఛాంబర్

వేతనాల పెంపు కోరుతూ బంద్కు పిలుపునిచ్చిన టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్కు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ షాకిచ్చింది. ‘మేమిచ్చే వేతనానికి ఎవరైతే పని చేస్తారో వారితోనే షూటింగ్ చేసుకుంటాం. సభ్యత్వం అంటూ రూ.లక్షలు డిమాండ్ చేస్తూ ఔత్సాహికులకు యూనియన్లు అవరోధంగా మారాయి. స్కిల్డ్ వర్కర్స్కు పని కల్పించడమే మా లక్ష్యం. ఇతర చిత్ర పరిశ్రమల్లో ఇచ్చే వేతనాలకంటే తెలుగులోనే ఎక్కువ చెల్లిస్తున్నాం’ అని TFCC లేఖలో పేర్కొంది.
News August 5, 2025
మరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3గంటల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వర్షం పడుతుందని అంచనా వేసింది. గంటకు 40కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది.