News October 25, 2024
నేటి నుంచి మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన
AP: ఇవాళ్టి నుంచి నవంబర్ 1 వరకు మంత్రి లోకేశ్ అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జార్జియా ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో ఆయన ప్రసంగిస్తారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చిస్తారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో రేపు ఒరాకిల్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు.
Similar News
News November 7, 2024
బెంగళూరు పర్యటనకు హైడ్రా బృందం
TG: హైడ్రా బృందం రెండు రోజుల పర్యటనకు గాను బెంగళూరు వెళ్లింది. అక్కడ చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో బృందం అధ్యయనం చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో ఆక్రమణల తొలగింపుపై హైడ్రా కాస్త నెమ్మదించింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో నిఘా, రియల్ టైమ్‌లో కబ్జాలను కనిపెట్టేలా టెక్నాలజీని హైడ్రా పటిష్ఠపర్చుకుంటోంది.
News November 7, 2024
కులగణనతో లెక్క తేల్చేస్తారా!
తెలంగాణలో కులగణన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమయింది. ఇది జస్ట్ టైం పాస్ అంటూ బీజేపీ కొట్టిపడేస్తోంది. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే ఏమైందంటూ ప్రశ్నిస్తోంది. ఇటు బీఆర్ఎస్ నేతలు సర్వేకు వివరాలు ఇచ్చేది లేదంటున్నారు. అయితే అన్ని వర్గాలకు సర్వేతో ఆర్థిక, విద్య, రాజకీయ అవకాశాలు మెరుగవుతాయని, రిజర్వేషన్లు పెరుగుతాయని GOVT చెబుతోంది. TGలో బీసీల లెక్క తేలుతుందని బీసీ సంఘాలు అంటున్నాయి. మరి దీనిపై మీరేమంటారు.
News November 7, 2024
ఇండియాలో IIT ఢిల్లీ టాప్
భారతదేశంలోని విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌ను QS ఆసియా విడుదలచేసింది. ఈ సంవత్సరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ IIT బాంబేను అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది ఆసియాలో 46వ స్థానంలో ఉన్న IIT ఢిల్లీ, 44వ స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాతి స్థానాల్లో IIT బాంబే, IIT మద్రాస్, IIT ఖరగ్‌పూర్, IISc బెంగళూరు, IIT కాన్పూర్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, IIT గౌహతి, IIT రూర్కీ, JNU ఢిల్లీ ఉన్నాయి.