News October 15, 2024

మంత్రి నారాయణ 100 దరఖాస్తులు.. ఎన్ని గెలిచారంటే?

image

AP: తన గెలుపు కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తల కోసం మంత్రి నారాయణ రూ.2 కోట్లతో 100 వైన్ షాపులకు దరఖాస్తులు చేశారు. వీటిలో 3 దుకాణాలు దక్కగా, ఒక్కో షాపును ఐదుగురికి ఇచ్చేశారు. అలాగే విజయవాడకు చెందిన ఓ బార్ ఓనర్ ఏకంగా 480 దరఖాస్తులు వేయగా 11 షాపులు దక్కించుకున్నారు. ఇక పెనుగంచిప్రోలులోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేసే రామకృష్ణ అనే వ్యక్తినీ అదృష్టం వరించింది. మొత్తం దుకాణాల్లో 10 శాతం మహిళలకే దక్కాయి.

Similar News

News November 6, 2024

తెలంగాణలో ఇవాళ్టి నుంచి కులగణన

image

TG: ఇవాళ్టి నుంచి కులగణన ప్రారంభం కానుంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై వివరాలు సేకరిస్తారు. దాదాపు 85 వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తారు. 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక పరిశీలకుడిని నియమించగా, 10% కుటుంబాలను వీరు మరోసారి సర్వే చేస్తారు. ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

News November 6, 2024

ఇవాళ్టి నుంచి ఆందోళనలు: షర్మిల

image

AP: విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్‌తో PCC చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ్టి నుంచి 3 రోజులు ఆందోళనలు చేపట్టనున్నాయి. ‘ఛార్జీల పెంపు పాపం వైసీపీదని, కూటమికి సంబంధం లేదని చెప్పడం సరికాదు. అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచబోమని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలి’ అని ఆమె సూచించారు. విజయవాడ ధర్నాచౌక్‌లో జరిగే నిరసనలో షర్మిల పాల్గొంటారు.

News November 6, 2024

ఫోన్ ఛార్జింగ్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

చాలామంది ఫోన్ ఛార్జింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అది ఫోన్ల పేలుళ్లకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ఈ జాగ్రత్తలు పాటించండి.
* రాత్రంతా ఛార్జింగ్ పెట్టొద్దు. ఫోన్‌ను బట్టి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి పట్టే సమయాన్ని తెలుసుకొని, అంతసేపే ఛార్జింగ్ పెట్టాలి.
* ప్లగ్ ఇన్ చేసి ఫోన్ మాట్లాడటం, చాటింగ్ చేయొద్దు.
* వంటగదుల్లో ఛార్జింగ్ పెట్టొద్దు.
* ఫుల్ ఛార్జ్ అయినా స్విచ్ ఆఫ్ చేయకపోవడం ప్రమాదకరం.