News February 20, 2025

కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి సెటైర్లు

image

TG: బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఎలా ఉందో చూడటానికి కేసీఆర్ బయటకు వచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెటైర్లు వేశారు. అసెంబ్లీకి రావాలనే ఆలోచన ఆయనకు లేదని విమర్శించారు. సభకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా ప్రవర్తించారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ స్కాములను ప్రజలకు చూపిస్తున్నామని తెలిపారు. పాస్ పోర్టు రెన్యూవల్‌కు వచ్చి ముఖం చూపించి పోయారన్నారు.

Similar News

News March 17, 2025

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ

image

TG: ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు లేఖ రాశారు. అఖిల పక్ష నేతలతో కలిసి ఆయనతో భేటీ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అన్ని పార్టీలు మద్దతుతో పాటు అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా చొరవ చూపాలని కోరేందుకు రేవంత్ పీఎంకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

News March 17, 2025

రాత్రి ఈ టెక్నిక్స్ పాటిస్తే..

image

త్వరగా నిద్రపోయేందుకు ఇటీవల చాలామంది మిలిటరీ మెథడ్ ఫాలో అవుతున్నారు. తక్కువ సమయంలో నిద్రకు సైనికులు పాటించే ఈ విధానంతో 10 సెకన్లలోనే నిద్ర వస్తుందట. పడుకుని ముఖంలోని కండరాలతో పాటు భుజాలు, చేతులు, కాళ్లు సహా శరీరాన్నంతా వదులుగా ఉంచాలి. దీర్ఘ శ్వాసలతో పది సెకన్ల పాటు ప్రశాంత ఘటనను ఆలోచిస్తూ కళ్లు మూసుకోవాలి. ఒకవేళ నిద్ర రాలేదంటే మనసులోకి వచ్చే ఆలోచనలను ‘ఆలోచించకు’ అని ఆపేస్తూ తిరిగి ప్రయత్నించాలి.

News March 17, 2025

ఏడు వారాల నగలంటే ఏంటో తెలుసా?

image

ప్రతి మహిళకు ఏడువారాల నగలు ఉండాలనే కోరిక ఉంటుంది. కానీ చాలా మందికి 7 వారాల నగలేంటో తెలియదు. ఆదివారం(సూర్యుడు) ధరించేవి కెంపుల కమ్మలు & హారాలు, సోమవారం(చంద్రుడు) ముత్యాల హారం & గాజులు, మంగళవారం(కుజుడు) పగడాల దండలు& ఉంగరాలు, బుధవారం(బుధుడు) పచ్చల పతకాలు& గాజులు, గురువారం(బృహస్పతి) పుష్యరాగం& కమ్మలు& ఉంగరాలు, శుక్రవారం(శుక్రుడు) వజ్రాల హారాలు& వజ్రపు ముక్కుపుడక, శనివారం(శని) నీలమణి హారాలు. share it

error: Content is protected !!