News April 24, 2024
ఎంపీ అభ్యర్థి నామినేషన్‌పై మంత్రి పొన్నం కామెంట్స్
TG: కరీంనగర్ కాంగ్రెస్ <<13102151>>ఎంపీ<<>> అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అధిష్ఠానం నుంచి స్పష్టమైన సంకేతాలు ఉండడంతోనే ఆయన నామినేషన్ వేసినట్లు తెలిపారు. దీనిపై సీఈసీ అధికారికంగా ప్రకటన చేస్తుందన్నారు. బీజేపీలో సఖ్యత లేదని.. తామంతా ఐక్యంగా ఉన్నామని చెప్పారు.
Similar News
News January 13, 2025
ఇవాళ హైడ్రా ప్రజావాణికి సెలవు
TG: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సంక్రాంతి సెలవుల కారణంగా ఇవాళ ఉండదని హైడ్రా ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ సెలవులలో ప్రజావాణి నిర్వహించట్లేదని గతంలోనే ప్రకటించినట్లు తెలిపింది. వచ్చే సోమవారం(20.01.2025) తిరిగి నిర్వహిస్తామని పేర్కొంది.
News January 13, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 13, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.01 గంటలకు
✒ ఇష: రాత్రి 7.17 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 13, 2025
భోగి మంటల వెనుక శాస్త్రీయ కోణం!
భోగీ నాడు ఊరువాడ భోగి మంటలు వేయడం అనవాయితీగా ఉన్నా దీనికి శాస్త్రీయ కోణం ఉంది. ఈ మంటలు వేయడం వల్ల పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా సామాజిక బంధాలు బలపడతాయి. అందరూ ఒక చోట చేరడంతో ఐక్యత పెరుగుతుంది. చలి కాలంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇంట్లోని చెత్తను నిర్మూలించడమే కాకుండా ఈ బూడిద నుంచి పోటాషియం వంటి ఖనిజాలు మట్టికి అందుతాయి. ఈ మంటల్లో పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ది అవుతుంది.