News May 3, 2024
రేషన్ కార్డుల జారీపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
TG: రేషన్ కార్డుల జారీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు పూర్తికాగానే అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలవగానే నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పదేళ్లలో తెలంగాణ విభజన హామీలను కేంద్రంలోని బీజేపీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
Similar News
News November 11, 2024
మ్యాన్‌హోల్స్ మూతలు రౌండ్‌గానే ఎందుకు?
దీనికి పలు కారణాలున్నాయి. వేరే ఆకారంలో ఉంటే మూత తీసేటప్పుడు పొరపాటున లోపలికి పడవచ్చు. రౌండ్‌గా ఉంటేనే ఎటువైపు నుంచీ లోపల పడిపోదు, పైకి సైతం సులువుగా ఎత్తవచ్చు. వృత్తాకారంలో ఉంటేనే ఈజీగా పక్కకు తరలించవచ్చు. అంతే సులువుగా మూత బిగించవచ్చు. ఒక సైజులోని చతురస్రం సహా ఏ ఇతర ఆకారాల్లోని మూత ఎంత స్థలాన్ని మూయగలదో అదే స్పేస్‌ను రౌండ్ షేప్ తక్కువ సైజులో మూస్తుంది. దీంతో నిర్మాణ ఖర్చు కూడా తక్కువ అవుతుంది.
News November 11, 2024
ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్ కొట్టివేత
లైంగిక వేధింపుల కేసులో కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. పలువురు మహిళలపై ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడినట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో వీడియోలు బయటికొచ్చాయి. దీంతో ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మేలో అరెస్ట్ చేశారు.
News November 11, 2024
ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టుబట్టి గ్రూప్-1 జరిపా: CM
TG: గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క గ్రూప్-1 కూడా నిర్వహించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 2011లో చివరిసారిగా గ్రూప్-1 నిర్వహించారని, దాదాపు 13 ఏళ్ల పాటు పోస్టులు భర్తీ చేయలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టుబట్టి గ్రూప్-1 జరిపానని, ఎంపికైన వారికి త్వరలో నియామకపత్రాలు అందిస్తానని పేర్కొన్నారు.