News February 18, 2025
నేడు రాజస్థాన్కు మంత్రి సీతక్క

TG: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క నేడు రాజస్థాన్కు వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అక్కడ నిర్వహిస్తున్న వాటర్ విజన్-2047 సదస్సులో ఆమె పాల్గొంటారు. తెలంగాణలో గ్రామీణ మంచినీటి సరఫరా గురించి మంత్రి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రక్షిత మంచినీటి విషయంలో ఆర్థిక సహకారం అందించాలని కేంద్రాన్ని కోరనున్నారు.
Similar News
News February 20, 2025
‘లైలా’ డిజాస్టర్.. విశ్వక్సేన్ కీలక నిర్ణయం

‘లైలా’ సినిమా డిజాస్టర్ కావడంపై విశ్వక్ సేన్ ప్రకటన విడుదల చేశారు. ‘మీరు కోరుకున్న స్థాయికి నా సినిమాలు చేరుకోలేకపోయాయి. లైలాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను అంగీకరిస్తున్నా. మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నా. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదు. నా ప్రతి సన్నివేశం మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నా. త్వరలో మరొక బలమైన కథతో మీ ముందుకు వస్తా’ అని విశ్వక్ పేర్కొన్నారు.
News February 20, 2025
టీమ్ ఇండియా చెత్త ఫీల్డింగ్.. బంగ్లాకు వరం!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా ఘోరమైన ఫీల్డింగ్ చేస్తోంది. అక్షర్ బౌలింగ్లో రోహిత్ ఓ క్యాచ్, జడేజా బౌలింగ్లో కేఎల్ రాహుల్ స్టంపింగ్ మిస్, శ్రేయస్ అయ్యర్ రనౌట్ ఛాన్స్ మిస్, కుల్దీప్ బౌలింగ్లో హార్దిక్ పాండ్య ఓ క్యాచ్ మిస్ చేశారు. దీంతో బంగ్లా బ్యాటర్లు బతికిపోయారు. టీమ్ఇండియా చెత్త ఫీల్డింగ్ కారణంగా బంగ్లా 35/5 దశ నుంచి 120/5తో కోలుకుంది.
News February 20, 2025
యథాతథంగా గ్రూప్-2 పరీక్షలు: APPSC

గ్రూప్-2 మెయిన్ పరీక్షలు వాయిదా పడతాయన్న ప్రచారంలో నిజం లేదని APPSC ఛైర్మన్ అనురాధ స్పష్టం చేశారు. ఈనెల 23న 10am-12.30pm పేపర్-1, 3pm-5.30pm పేపర్-2 నిర్వహిస్తామని తెలిపారు. 175 పరీక్షా కేంద్రాల్లో 92,250 మంది పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు 100m పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, సోషల్ మీడియాలో వదంతులు సర్కులేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.