News August 21, 2024

అమర రాజా ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

image

TG: అమర రాజా కంపెనీ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. MBNRలోని దివిటిపల్లిలో లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్ వచ్చే ఆరేళ్లలో పూర్తి చేయాలన్నారు. ప్లాంట్ నుంచి జాతీయ రహదారి వరకు 3KMల అప్రోచ్ రోడ్డుకు భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. రూ.9,500 కోట్ల ఈ ప్రాజెక్ట్ మొదటి దశ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతోంది.

Similar News

News September 19, 2024

తెలుగు వర్సిటీకి ‘సురవరం’ పేరు.. రేపు ఆమోదం

image

TG: హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ వర్సిటీకి ప్రముఖ కవి, ఉద్యమకారుడు సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును ప్రభుత్వం పెట్టనుంది. రేపు జరిగే క్యాబినెట్ భేటీలో ఆమోదం తెలపనుంది. ఈ వర్సిటీ 1985లో ఏర్పడింది. ఇది పదో షెడ్యూల్‌లో ఉండటంతో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లపాటు ఇదే పేరు కొనసాగింది. గడువు ముగియడంతో పేరు మార్చుతున్నారు.

News September 19, 2024

నేడు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. ఇందులో విశాఖ పరిధిలోనే 25 క్యాంటీన్లు ఉన్నాయి. మొత్తంగా 203 కేంద్రాలను మొదలుపెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా తొలి విడతలో 100 క్యాంటీన్లను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ రూ.5కే ఉదయం ఇడ్లీ/పూరి/ఉప్మా/పొంగల్, చట్నీ, సాంబార్, లంచ్- డిన్నర్‌లో అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి అందిస్తారు.

News September 19, 2024

INDvsBAN: నేటి నుంచే తొలి టెస్టు

image

చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు నేడు ప్రారంభం కానుంది. సొంత గడ్డపై 2012 నుంచి టెస్టు సిరీస్ ఓడని IND తన ఖాతాలో మరో సిరీస్‌ను వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. పాక్‌ను వైట్‌వాష్ చేసిన ఊపులో ఉన్న బంగ్లా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలనుకుంటోంది. ఉ.9.30 నుంచి స్పోర్ట్స్18లో వీక్షించవచ్చు.
IND అంచనా టీమ్: రోహిత్, జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, పంత్, జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, బుమ్రా