News February 18, 2025
9 మంది ESI ఆస్పత్రి ఉద్యోగులను సస్పెండ్ చేసిన మంత్రి

AP: రాజమహేంద్రవరం ESI ఆస్పత్రిలో 9మంది ఉద్యోగులపై సన్పెన్షన్ వేటు పడింది. కొందరు వైద్యులు, సిబ్బంది విధుల్లో లేకుండా సంతకాలు పెట్టి వెళ్లడాన్ని నిన్నటి ఆకస్మిక పర్యటనలో మంత్రి వాసంశెట్టి సుభాష్ గుర్తించి మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించగా.. రాష్ట్ర బీమా వైద్య సేవల డైరెక్టర్ ఆంజనేయులు ఇవాళ సస్పెండ్ చేశారు. ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్, ముగ్గురు డ్యూటీ డాక్టర్లు తదితరులపై వేటు పడింది.
Similar News
News March 28, 2025
ఆయనకు న్యాయపరమైన విధులు వద్దు: సుప్రీంకోర్టు

జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు న్యాయపరమైన విధులు అప్పగించవద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. కాగా జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్దఎత్తున నోట్ల కట్టలు బయటపడటంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు.
News March 28, 2025
నాకు రూల్స్ పెడితే నచ్చదు: సమంత

సక్సెస్ అంటే గెలవడం మాత్రమే కాదని, ప్రయత్నించడమూ విజయంలో భాగమేనని సమంత చెప్పారు. రివార్డులు వస్తే కాదు.. తనకు నచ్చినట్లు బతికితే అదే సక్సెస్ అని పేర్కొన్నారు. సిడ్నీలో జరిగిన ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ‘ఆడపిల్ల కాబట్టి అది, ఇది చేయకూడదు అని రూల్స్ పెడితే నచ్చదు. నాకు ఇష్టమొచ్చినట్లు జీవించాలనుకుంటా. లైఫ్‌లో, తెరపై అన్ని రకాల పాత్రలను పోషించాలి. అదే నా గెలుపు అనుకుంటా’ అని పేర్కొన్నారు.
News March 28, 2025
BREAKING: టాస్ గెలిచిన CSK

చెన్నై వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నారు.
CSK: రచిన్ రవీంద్ర, రుతురాజ్, త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కర్రన్, జడేజా, ధోనీ, అశ్విన్, నూర్, మతీశా, ఖలీల్
RCB: కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, రజత్, లివింగ్‌స్టోన్, జితేశ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, యశ్ దయాల్