News March 29, 2024

రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

image

TG: మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందుకు ఆర్బీఐ, బ్యాంకులతో కలిసి విధి విధానాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు 6,47,589 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేశాం. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది’ అని ఆయన తెలిపారు.

Similar News

News January 24, 2026

బడ్జెట్ 2026: పాత పన్ను విధానానికి కాలం చెల్లినట్లేనా?

image

బడ్జెట్ 2026లో పాత ఆదాయపు పన్ను విధానాన్ని రద్దు చేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే 72% మంది ట్యాక్స్ పేయర్స్ కొత్త విధానానికే మొగ్గు చూపుతున్నారు. పాత దాంట్లో పెట్టుబడుల లెక్కలు చూపడం, తనిఖీలు, నోటీసులు ఎదుర్కోవడం కష్టమవుతుండటంతో.. ప్రభుత్వం దీన్ని రద్దు చేయొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఒక్కసారిగా కాకుండా కొంత గడువు ఇచ్చి తీసేయొచ్చని భావిస్తున్నారు.

News January 24, 2026

ట్రంప్ చేతికి గాయం.. అసలేమైంది?

image

చేతికి గాయంతో ట్రంప్ కనిపించడం చర్చనీయాంశమవుతోంది. 2 రోజుల కిందట దావోస్‌లో గాజా శాంతి మండలిని ట్రంప్ ప్రారంభించారు. అప్పుడు ఆయన చేతిపై గాయం కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి. దీనిపై మీడియా ప్రశ్నించగా.. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నా. టేబుల్ తగలడంతో గాయమైంది. దానికి క్రీమ్ రాశా. <<18737292>>గుండె ఆరోగ్యం<<>> బాగుండాలంటే ఆస్పిరిన్ తీసుకోవాలి. గాయాలు కావద్దనుకుంటే ఆస్పిరిన్ తీసుకోవద్దు’ అని ట్రంప్ అన్నారు.

News January 24, 2026

రామ్‌చరణ్ ‘పెద్ది’ వాయిదా?

image

రామ్‌చరణ్-బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ రిలీజ్ డేట్ వాయిదా పడే ఛాన్స్ ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి నెల రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని, పోస్ట్ ప్రొడక్షన్‌తో కలిపితే ఇంకా ఆలస్యం అవుతుందంటున్నాయి. దీంతో మేకర్స్ ముందుగా ప్రకటించిన మార్చి 27న రిలీజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదని చర్చించుకుంటున్నాయి. మే లేదా జూన్ నెలలో విడుదల చేసే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నాయి.