News March 29, 2024

రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

image

TG: మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందుకు ఆర్బీఐ, బ్యాంకులతో కలిసి విధి విధానాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు 6,47,589 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేశాం. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది’ అని ఆయన తెలిపారు.

Similar News

News January 23, 2025

సంజూపై కుట్ర పన్నుతున్నారు: తండ్రి

image

సంజూ శాంసన్‌ను బీసీసీఐ విచారించనుందన్న నేపథ్యంలో కేరళ క్రికెట్ అసోసియేషన్‌పై ఆయన తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. KCA సంజూపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ‘6 నెలలుగా KCA కుట్రలు చేస్తోంది. అక్కడ నా బిడ్డ సురక్షితంగా లేడు. ప్రతిదానికి సంజూపై నిందలు వేస్తోంది. ప్రజలు కూడా వాటిని నమ్ముతున్నారు. అందుకే నా కొడుకు కేరళ తరఫున ఆడటం మానేయాలని నేను కోరుకుంటున్నా’ అని తెలిపారు.

News January 23, 2025

సుభాష్ చంద్రబోస్ రాసిన అరుదైన లేఖలు

image

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాసిన అరుదైన లేఖలను ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా షేర్ చేసింది. ‘ఇండియా కోసం నేతాజీ సిరా కూడా రక్తం చిందించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాసిన అరుదైన లేఖలు మీరూ చూసేయండి. ఇవి లేఖలే కాదు స్వతంత్ర భారతదేశం గురించి ఆయన కలలుగన్న లక్ష్యాలు, సంకల్పం, దృక్పథానికి సాక్ష్యాలు’ అని తెలిపింది.

News January 23, 2025

స్విగ్గీ, జొమాటోకు షాకివ్వబోతున్న రెస్టారెంట్లు!

image

ప్రైవేటు లేబుల్ ఫుడ్ పేరుతో తమ వ్యాపారానికి కత్తెరేస్తున్న స్విగ్గీ, జొమాటోను నిలువరించేందుకు రెస్టారెంట్లు సిద్ధమవుతున్నాయి. కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేసేందుకు ONDC బాట పడుతున్నాయి. ఇప్పటికే గ్రౌండ్‌వర్క్ మొదలైందని NRAI తెలిపింది. దీంతో మళ్లీ తమ డిజిటల్ ఓనర్‌షిప్ పెరుగుతుందని, కస్టమర్ల డేటా యాక్సెస్‌కు వీలవుతుందని పేర్కొంది. తమపై కమీషన్, కస్టమర్లపై డెలివరీ ఛార్జీల భారం తగ్గుతుందని అంటోంది.