News April 10, 2024

పోలవరం గురించి అడిగితే మంత్రి డాన్స్ చేస్తారు: పవన్ కళ్యాణ్

image

AP: రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి, అతని కుమారుడు రాజకీయాల నుంచి తుడిచిపెట్టుకుపోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘పోలవరం అయ్యిందా అంటే ఓ మంత్రి డాన్సులు చేస్తారు. పునరావాసం అడిగితే అబ్బనీ తియ్యని దెబ్బ అంటారు. వైసీపీ పాలన పోవడం కోసం ఎన్నో త్యాగాలు చేశాం. తణుకులో అభ్యర్థిని ప్రకటించి వెనక్కి తగ్గాం. నాగబాబుకు టికెట్ ప్రకటించి కూడా బీజేపీ కోసం తప్పుకున్నాం’ అని స్పష్టం చేశారు.

Similar News

News February 13, 2026

BJPకి ఓట్ల శాతం పెరిగింది: రామచందర్ రావు

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే BJPకి ఓటు శాతం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. తమ పార్టీని ఓడించడానికి ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని ఆరోపించారు. మొత్తం వార్డులు డివిజన్లు కలిపి 350సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతున్నాం అని తెలిపారు. హంగ్ వచ్చిన చోట బీజేపీ ఎవరికీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు.

News February 13, 2026

తిరుమల లడ్డూ కల్తీకి, హెరిటేజ్‌కు సంబంధమేంటి: CBN

image

AP: హెరిటేజ్ సంస్థ బ్రాండ్‌ను దెబ్బతీయడమే YCP ఉద్దేశమని CM చంద్రబాబు మండిపడ్డారు. అలా చేస్తే హెరిటేజ్‌కు నష్టం వస్తుందనేది వాళ్ల భావనని విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీకి, హెరిటేజ్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఆ సంస్థ ఒక్క పైసా అడగలేదని అసెంబ్లీలో స్పష్టంచేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం సున్నిత సమస్యని చెప్పారు. కొంతమంది కావాలనే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఫైరయ్యారు.

News February 13, 2026

డెలివరీ తర్వాత బెల్టు వాడితే పొట్ట తగ్గుతుందా?

image

ప్రసవం తర్వాత పొట్టను తగ్గించడానికి చాలామంది అబ్డామినల్ బెల్టును వాడతారు. అది పొట్ట కండరాలకు ఆసరాగా, సౌకర్యంగా ఉంటుంది కానీ పొట్టను తగ్గించడంలో ఉపయోగపడదంటున్నారు నిపుణులు. వదులైన మజిల్స్ తిరిగి సాధారణ స్థితికి రావాలంటే వ్యాయామం తప్పనిసరి అని చెబుతున్నారు. క్రంచెస్‌, స్ట్రెయిట్‌ లెగ్‌ రైజింగ్‌, ప్లాంక్స్‌ లాంటి కొన్ని వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే పొట్ట తగ్గుతుందని సూచిస్తున్నారు.