News April 10, 2024
పోలవరం గురించి అడిగితే మంత్రి డాన్స్ చేస్తారు: పవన్ కళ్యాణ్

AP: రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి, అతని కుమారుడు రాజకీయాల నుంచి తుడిచిపెట్టుకుపోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘పోలవరం అయ్యిందా అంటే ఓ మంత్రి డాన్సులు చేస్తారు. పునరావాసం అడిగితే అబ్బనీ తియ్యని దెబ్బ అంటారు. వైసీపీ పాలన పోవడం కోసం ఎన్నో త్యాగాలు చేశాం. తణుకులో అభ్యర్థిని ప్రకటించి వెనక్కి తగ్గాం. నాగబాబుకు టికెట్ ప్రకటించి కూడా బీజేపీ కోసం తప్పుకున్నాం’ అని స్పష్టం చేశారు.
Similar News
News March 24, 2025
గుడ్ న్యూస్.. వాటిపై జీఎస్టీ తగ్గింపు?

లైఫ్, హెల్త్ పాలసీలపై GST తగ్గింపునకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే సమావేశంలో ఈ పాలసీలపై ట్యాక్స్ తగ్గించేందుకు జీఎస్టీ కౌన్సిల్ అంగీకరించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఉన్న 18శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించవచ్చని తెలిపాయి. అయితే పాలసీ మొత్తాన్ని బట్టి ఈ తగ్గింపు వర్తించే అవకాశముంది. ఈ నెలాఖరులో లేదా ఏప్రిల్ తొలివారంలో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది.
News March 24, 2025
బీసీసీఐ కాంట్రాక్ట్స్: గ్రేడ్-Aలో హర్మన్, స్మృతి, దీప్తి

2024-25కు గాను ఉమెన్స్ క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టులను బీసీసీఐ ప్రకటించింది. గ్రేడ్-Aలో హర్మన్, స్మృతి, దీప్తి చోటు దక్కించుకున్నారు. గ్రేడ్-Bలో రేణుక, జెమీమా, రిచా, షఫాలీ, గ్రేడ్-Cలో యస్తిక, రాధ, శ్రేయాంకా, టిటాస్, అరుంధతీరెడ్డి, అమన్‌జోత్, ఉమ, స్నేహ్ రాణా, పూజ ఉన్నారు. గ్రేడ్ల వారీగా వీరికి వరుసగా రూ.50L, రూ.30L, రూ.10L వార్షిక వేతనం అందుతుంది. ప్రతి మ్యాచ్‌కూ ఇచ్చే శాలరీ అదనం.
News March 24, 2025
పార్లమెంట్ సభ్యుల జీతాలు పెంపు

ప్రస్తుత, మాజీ పార్లమెంట్ సభ్యులకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వారి జీతాలు, రోజువారీ భత్యం పెంచింది. ఇప్పటివరకూ ఉన్న రూ.లక్ష జీతాన్ని రూ.1.24 లక్షలకు పెంచింది. డైలీ అలవెన్స్ రూ.2వేల నుంచి రూ.2500కు, పెన్షన్‌ను రూ.25వేల నుంచి రూ.31వేలకు పెంచింది. అలాగే అదనపు పెన్షన్‌ను రూ.2500 చేసింది. ఇది APR 1, 2023 నుంచే అమల్లోకి రానుంది. కాగా, రెండేళ్ల బకాయిలను త్వరలో చెల్లించనుంది.