News August 9, 2024

మహిళలపై వేధింపుల్లో మైనర్లే అధికం: శిఖా గోయల్

image

TG: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మహిళలను వేధిస్తున్న 4,823 మందిపై కేసులు నమోదైనట్లు మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ వెల్లడించారు. వీరిలో 936 మంది 18 ఏళ్లలోపు వారే ఉన్నట్లు పేర్కొన్నారు. 449 FIRలు నమోదు చేసినట్లు తెలిపారు. వ్యక్తిగత వేధింపులే ఎక్కువ ఉన్నట్లు చెప్పారు. ఎక్కువగా వేధింపులకు గురయ్యే ప్రాంతాల్లో నిఘా, ఆధారాల సేకరణ, తక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News April 17, 2026

సౌందర్య.. అచ్చ తెలుగు ఆడపడుచులా!

image

టాలీవుడ్‌లో మహానటి సావిత్రి తర్వాత అంతటి అభిమానం పొందిన హీరోయిన్లలో సౌందర్య ఒకరు. ‘మనవరాలి పెళ్లి’తో 1993లో తెలుగు సినిమాల్లోకి వచ్చి పదేళ్లు సినీరంగాన్ని ఏలారు. 100కుపైగా మూవీస్‌లో నటించారు. అసభ్య వస్త్రధారణకు దూరంగా నిండైన చీరకట్టుతో అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించేవారు. కానీ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2004లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. నేడు సౌందర్య వర్ధంతి.

News April 17, 2026

ఇండియాకు వాంటెడ్ టెర్రరిస్టులు.. పాక్‌లో హతం!

image

లష్కరే తోయిబా(LeT) కో ఫౌండర్ అమీర్ హమ్జాపై పాక్‌లో <<19664047>>కాల్పులు<<>> జరగడం తెలిసిందే. మూడేళ్లుగా LeT, జైషే(JeM), హిజ్బుల్(HM)లోని వాంటెడ్ టెర్రరిస్టులు ‘గుర్తుతెలియని వ్యక్తుల’ కాల్పుల్లో హతమవుతున్నారు. మహ్మద్ తాహిర్ అన్వర్(JeM చీఫ్ మసూద్ అజర్ అన్న), LeT టెర్రరిస్టు అబు ఖతల్(హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు), ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పంజ్‌వార్‌తో సహా ఎంతో మందిని పాక్‌లో మట్టుబెట్టారు.