News April 12, 2024
అయోధ్యలో అద్భుతం.. 17న రామయ్యకు ‘సూర్య తిలకం’
అయోధ్యలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. బాలరాముడు కొలువుదీరిన తర్వాత తొలిసారి ఈ నెల 17న శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఆ రోజున మధ్యాహ్నం 12 గంటలకు రాముడి నుదుటిపై 75MM వ్యాసార్థంతో సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. దాదాపు 6 నిమిషాలపాటు ఈ అపురూప దృశ్యం భక్తులకు కనువిందు చేయనుంది. ఏటా నవమి రోజున ఇలా జరిగేలా ఆలయాన్ని నిర్మించారు.
Similar News
News November 16, 2024
విమానంలో బాంబు ఉందంటూ ప్రయాణికుడి కేకలు
TG: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న విమానంలో ఎక్కిన ఓ ప్రయాణికుడు బాంబు ఉందంటూ కేకలు వేశాడు. అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకొని, విమానంలో తనిఖీలు చేశారు. బాంబు లేదని తేల్చారు.
News November 16, 2024
జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ చూశా: సంజూ
SAపై నాలుగో T20లో సెంచరీ చేసిన అనంతరం సంజూ శాంసన్ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇన్నింగ్స్ బ్రేక్‌లో మాట్లాడుతూ ‘శ్వాస వేగంగా తీసుకుంటున్నా. మాట్లాడటం కష్టంగా ఉంది. జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొన్నా. ఎంతో కష్టపడి ఇంత వరకు వచ్చా. ఈ సిరీస్‌లో ఓ సెంచరీ తర్వాత వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యా. దీంతో ఎన్నో విషయాలు నా తలలో తిరిగాయి. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్, తిలక్ నాకు హెల్ప్ చేశారు’ అని పేర్కొన్నారు.
News November 16, 2024
అప్పుడు ఫస్ట్ బాల్‌కే అవుట్ అయ్యా: తిలక్ వర్మ
సౌతాఫ్రికాపై నిన్న జరిగిన టీ20తో సహా సిరీస్‌లో 2సెంచరీలు చేసిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కించుకున్నారు. ఇది తనకు గొప్ప అనుభూతి అని, గతేడాది ఇక్కడ తొలి బంతికే అవుట్ అయినట్లు చెప్పారు. సౌతాఫ్రికాలోని ఛాలెంజింగ్ కండీషన్లలో 2సెంచరీలు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. మరోవైపు, ఓ టీ20 సిరీస్‌లో MOTM, MOTS అవార్డులు అందుకున్న యంగెస్ట్ క్రికెటర్‌గా నిలిచారు.