News December 2, 2024
అద్భుతం: HIV ఎయిడ్స్‌కు వ్యాక్సిన్.. 100 శాతం సక్సెస్

లెనాకాపవిర్(Sunlenca బ్రాండ్) అనే డ్రగ్‌తో ఏడాదికి 2 టీకాలు వేయడం ద్వారా HIV ఎయిడ్స్‌ను నివారించవచ్చని తేలింది. 5వేల మంది మహిళలపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో 100% ప్రభావవంతంగా పనిచేసినట్లు వెల్లడైంది. ఇది ఎయిడ్స్ నివారణలో కీలక మలుపు అని గిలియడ్ కంపెనీ తెలిపింది. ఇప్పటికే అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, 120 పేద దేశాల్లో తక్కువ ధరకు అందిస్తామని ప్రకటించింది.
Similar News
News February 18, 2025
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. నిందితులకు ముగిసిన విచారణ

AP: తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో నలుగురు నిందితులకు కోర్టు విధించిన 5 రోజుల కస్టడీ ముగిసింది. సిట్ తాత్కాలిక కార్యాలయంలో వారి విచారణ జరగ్గా, ఇవాళ రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరుపతి 2వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. నిందితులు విచారణకు సహకరించట్లేదని, మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని సిట్ అధికారులు కోరినట్లు సమాచారం.
News February 18, 2025
SHOCKING.. కుంభమేళాలో నీటిలో ప్రమాదకర బ్యాక్టీరియా

కుంభమేళా వేళ గంగా నదిలో నీటి నాణ్యతపై పొల్యూషన్ కంట్రోల్ అధికారులు ఆందోళన రేకెత్తించే అంశాలను వెల్లడించారు. ఈ నీళ్లలో చర్మానికి హానిచేసే కోలిఫామ్ బ్యాక్టీరియా పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లోని నీరు స్నానం చేయడానికి పనికిరాదని NGTకి తెలిపింది. ప్రతి 100mm నీటిలో 2,500 కోలిఫామ్ బ్యాక్టీరియా ఉంటే స్నానం చేయవచ్చని CPCB చెబుతోంది. కాగా దీనిపై విచారణను NGT రేపటికి వాయిదా వేసింది.
News February 18, 2025
విభజన హామీలను పవనే సాధించాలి: ఉండవల్లి

AP: రాష్ట్ర అవసరాలు, విభజన హామీలు సాధించుకోవడానికి ఇదే సరైన సమయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పవన్ తలుచుకుంటే ఇది సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే విషయమై పవన్‌కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. విభజన హామీలో రాష్ట్రానికి రూ.75,050 కోట్లు రావాలని, దీనిపై పార్లమెంటులో ప్రస్తావించాలని కోరినట్లు వెల్లడించారు. జగన్, చంద్రబాబు సాధించలేని విభజన హామీలు పవన్ సాధించాలని సూచించారు.