News March 13, 2025
మహిళలతో తప్పుడు ప్రవర్తన.. చెంప చెళ్లుమనిపించా: హీరో

మహిళలతో తప్పుగా ప్రవర్తించిన ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించానని హిందీ నటుడు గోవిందా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘2008లో సంతోష్ అనే అభిమాని నా కోసం సెట్స్‌కు వచ్చాడు. అతడు మహిళలతో తప్పుగా ప్రవర్తించడం చూసి చెంప మీద కొట్టాను. దీంతో అతడు నాపై కేసు పెట్టాడు. 9ఏళ్లపాటు ఆ కేసు సాగింది. ఎట్టకేలకు అతడిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఆధారాలు సంపాదించి కేసు గెలిచాను’ అని తెలిపారు.
Similar News
News March 13, 2025
జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అన్యాయం: కేటీఆర్

TG: అనని మాటలు అన్నట్లుగా చూపి జగదీశ్ రెడ్డిని అన్యాయంగా సస్పెండ్ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి బయటికి వచ్చి అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఏదైనా తప్పుగా మాట్లాడితే సభలో విచారం వ్యక్తం చేస్తామని చెప్పినప్పటికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. రేపు అన్ని నియోజకవర్గాల్లో INC దిష్టిబొమ్మలు దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
News March 13, 2025
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
News March 13, 2025
LSGకి గుడ్‌న్యూస్.. మిచెల్ మార్ష్‌కు లైన్ క్లియర్

వెన్నెముక గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ IPLలో ఆడనున్నట్లు తెలుస్తోంది. మెడికల్ టీమ్ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు క్రిక్ఇన్ఫో తెలిపింది. ‘బౌలింగ్ చేయకుండా, ఫీల్డింగ్‌లో ఒత్తిడి పడకుండా చూడాలన్న వైద్యుల సూచన మేరకు మార్ష్ కేవలం బ్యాటర్‌గా, ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం ఉంది’ అని పేర్కొంది. ఆయనను వేలంలో LSG దక్కించుకుంది.