News July 12, 2024
కెనడాలో భారతీయుడి దుశ్చర్య.. అరెస్టు

కెనడాలో ఓ భారత వ్యక్తి దుశ్చర్యకు పాల్పడ్డాడు. న్యూ బ్రూన్స్‌విక్ ప్రావిన్స్‌లోని ఓ వాటర్ పార్కులో మహిళలపై వరసగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుల్లో మైనర్లు కూడా ఉన్నారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నోవా స్కాషియా ప్రాంతంలో అతడు నివాసం ఉంటున్నాడని వారు తెలిపారు. పరాయి దేశంలో ఇండియా పరువు పోయేలా వ్యవహరించాడంటూ స్థానిక భారతీయులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 7, 2025
నేడు వడ్డీ రేట్లు ప్రకటించనున్న ఆర్బీఐ

ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల్ని కాసేపట్లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించనున్నారు. కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెషన్ ఆరంభ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 87.80 పాయింట్లు పెరిగి 78,145.96 వద్ద ఉంది. నిఫ్టీ 35.05 పాయింట్లు లాభపడి 23,638 వద్ద ట్రేడయింది.
News February 7, 2025
వైద్యశాస్త్రంలో అరుదు.. మోచేతిపై పురుషాంగం

వైద్యశాస్త్రంలోని సంఘటనలు అప్పుడప్పుడు ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే HYDలో జరిగింది. సోమాలియాకు చెందిన యువకుడికి చిన్నప్పుడు సున్తీ కారణంగా ఇన్‌ఫెక్షన్ సోకి పురుషాంగం తొలగించారు. తిరిగి పొందేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరికి హైటెక్ సిటీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించాడు. వైద్యులు అతడి మోచేతిపై పురుషాంగాన్ని డెవలప్ చేసి, దాన్ని మర్మాంగాలు ఉండే ప్లేస్‌లో అమర్చారు.
News February 7, 2025
ఇది కదా సక్సెస్ అంటే.. రూ.40 లక్షల నుంచి రూ.20 కోట్లకు

‘పాతాల్ లోక్’ వెబ్ సిరీస్ పార్ట్ 2 అమెజాన్ ప్రైమ్‌లో అదరగొడుతోంది. ముఖ్యంగా హాథీరామ్ చౌదరి పాత్రలో జైదీప్ అహ్లావత్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. 2020లో రిలీజైన మొదటి పార్ట్‌కు కేవలం రూ.40లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న అతను ఇప్పుడు ఏకంగా రూ.20 కోట్లు అందుకున్నారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో సక్సెస్ అంటే ఇదేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.